పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ సీరియస్ మీరు ఒక తల్లికి పు**..

ప్రస్తుతం సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ మధ్య కామెంట్ల రచ్చ సాగుతోంది. కొంతమంది పవన్ అభిమానులు హద్దు మీరి మరీ వ్యాఖ్యలు చేయడంతో రేణు దేశాయ్ వాటిని స్టోరీలో పోస్ట్ చేసి, అలాంటి వారందరిపై ఫైర్ అయింది. దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ తెగ రెచ్చిపోయారు. అసలు ఈ వివాదం ఎలా నెలకొంది అంటే.. ఏప్రిల్ 8న పవన్, రేణు దేశాయ్ తనయుడు అకిరా పుట్టిన రోజు కావడంతో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. దీంతో పవన్ అభిమాని ఒకతను అకిరా ఫోటో లేదా వీడియొ పెట్టాలని కామెంట్ చేశారు. మేడమ్ ఇది చాలా అన్యాయం.. మా అకిరాని ఒకసారైనా చూపించండి. మా అన్న కొడుకుని మాకు చూడాలని ఉంటుంది. మీరు హైడ్ చేయకండి. అప్పుడప్పుడైనా మీరు వీడియోలలో అయినా మా అకిరా బాబుని చూపించండి.. అంటూ పవన్ అభిమాని కామెంట్ చేశారు. ఈ కామెంట్ పై రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. మీ అన్న కొడుకా..? అకిరా మా అబ్బాయి.. మీరు ఒక తల్లికి పుట్టలేదా..? మీరు పవన్ కి వీర అభిమానులని నేను అర్ధం చేసుకోగలను. ముందు మాట్లాడే పద్దతి నేర్చుకోండి అంటూ తీవ్ర స్థాయిలో రేణు దేశాయ్ కౌంటర్ ఇచ్చారు. 11 ఏళ్లుగా నన్ను ఒక విలన్ గా చూస్తున్నారు… ఇప్పటికైనా స్పందించకపోతే.. ఇది మానసిన ఆరోగ్యంపై ప్రభావం చూపించేలా ఉందని రేణు దేశాయ్ తన insta స్టోరీస్ లో రాసుకొచ్చారు. దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ.. మేడమ్తెలుగు రాష్ట్రాలలో నువ్వు ఎవరి బిడ్డవని అడిగితే తండ్రిపేరే చెబుతారు. ఇది మా సంస్కృతి కాబట్టి కారణం లేకుండా అభిమానులపై సీరియస్ అవకండి అంటూ కామెంట్ చేశారు.