వైఎస్సార్సీపీ బలంగానే ఉంది రాఘవేంద్రరావుకు పీక‌ల దాకా కోపం ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం

1.స్కూళ్లుకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి..
ట్యాబులు ఎక్కడ రిపేరు వచ్చినా వెంటనే దానికి మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశం.

2.. ఎమ్మెల్యే పార్టీ వీడినా ఎలాంటి నష్టం లేదు.. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ బలంగానే ఉంది..
ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వైఖరి వల్ల నేతలు పార్టీకి దూరమయ్యారని కొడవలూరు ధనుంజయ రెడ్డి ధ్వజ౦.

3.వైఎస్ వివేకా హత్య కేసులో మరోసారి హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాష్ రెడ్డి..
మార్చి 14న సీబీఐ జరిపిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డ్‌ను ఇవ్వాలని కోర్టును కోరిన అనినాష్ రెడ్డి.

4.మే 3న సీఎం జగన్ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన..
దాదాపు 2,200 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుందని మంత్రి అమర్‌నాథ్ వెల్లడి.

5.కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం
ఈ మేరకు ఉత్తర్వులు జారీ

6.విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొంటే జగన్ కు ఆత్మహత్యే గతి..
జగన్ కు ధైర్యముంటే మోదీ వద్దకెళ్లి ఆపాలన్న సీపీఐ నేత రామకృష్ణ.

7.కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..
ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం.

8.రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు కూడా జగన్‌పై పీక‌ల దాకా ఉంది..
పోసానికి సినిమాలు ఇవ్వొద్దు…తొక్కిపెడదాం అని అనుకుంటున్నారు.. అయినా నేను లొంగను అంటూ పోసాని కృష్ణ ముర‌ళి సంచలన వ్యాఖ్యలు.

9.లోకేష్ యువగళం పాదయాత్ర సజావుగా సాగేటట్లు రక్షణ ఏర్పాట్లు చేయ౦డి..
అరాచకం, దౌర్జన్యాలకు పేరుగాంచిన పెద్దిరెడ్డి పాదయాత్రను భగ్నం చేస్తానని చెప్పడం సరికాద౦టూ డీజీపీకి వర్ల రామయ్య లేఖ.

10.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేతగాక రంగులు, పేర్లు మార్చుకుంటూ స్టిక్కర్‌ పాలన సాగిస్తున్నారు..
నాలుగేళ్ళపాటు ప్రజల్ని వంచించి ఇప్పుడు నమ్మకం, భవిష్యత్‌ అంటూ బూటకపు మాటలు చెబుతున్నారని గొట్టిపాటి రవికుమార్‌ విమర్శ.