నారు పోసావా..? నీరు పెట్టావా..? కోత కొస..? కుప్పనూడ్చవా..? ఒరేయ్ తెల్ల కుక్క.. నీకు సిస్తూ ఎందుకు కట్టాలిరా..? అంటూ ఒక యోధుడిగా చెప్పిన ఆ డైలాగ్ ఎంతగానో పాపులర్ అయ్యింది. ఈ మాదిరే తాజాగా మంత్రి అంబటి చెప్పిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి సెటైర్లు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు పెట్టావయ్య రాజకీయ పార్టీ..? జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం కోసం పెట్టావా..? ఓట్లు చీలకుండా ఉండేందుకు పెట్టావా..? రోజు రోజుకి దిగజారిపోతున్న చంద్రబాబు గ్రాఫ్ ను పెంచేందుకు పెట్టావా..? చంద్రబాబు పల్లకి మోయడానికి పెట్టావా..? లేక నువ్వు ముఖ్యమంత్రి అవడానికి పెట్టావా..? ఎందుకు పెట్టావు పార్టీ..? అంటూ మంత్రి అంబటి రాంబాబు పవన్ పై సేటర్లు వేశారు. సింగిల్ గా వెళ్తే జగన్ మమ్మల్ని ఉతుకుతాడు కదా.. మేము చస్తే సింగిల్ గా రాము బాబోయ్.. మేము కలిసే వస్తాం.. అంటున్నారు. కానీ నేను సవాల్ చేస్తున్నా.. కలిసికట్టుగా రండి.. కానీ ప్రజలే మిమ్మల్ని చితకబాది పంపిస్తారని అంబటి ఓ రేంజ్ లో పవన్ పై నిప్పులు చెరిగారు. ఎవరికోసమో రాజకీయ పార్టీని పెట్టే రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో చెల్లుబాటు కారని మంత్రి అంబటి పవన్ కి చురకలు అంటించారు. దమ్ముంటే సింగిల్ గా రా.. లేదంటే పొత్తులతో అయినా రా.. ఎలా వచ్చినా చివరికి నీకు ఓటమి ఖాయమని మంత్రి అంబటి సవాల్ చేశారు. నా పాలనలో మీకు మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి.. మంచి జరగకపోతే నన్ను ఆశీర్వదించకండి అంటూ చెప్పిన ఏకైక వ్యక్తి సిఎం జగన్.. నా ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో ఇలా చెప్పే రాజకీయ నాయకుడిని నేను ఎక్కడా చూడలేదని, సూటిగా మాట్లాడే వ్యక్తి.. గుండె ధైర్యం ఉన్న వ్యక్తి సిఎం జగన్ అంటూ మంత్రి అంబటి ముక్త కంఠంగా చెప్పారు. ఎన్ని శక్తులు ఏకమైనా సిఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరని మంత్రి అంబటి సవాల్ చేశారు.