టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత పుసుక్కున నోరు జారారు. రాబోయే కాలంలో జగన్ మోహన్ రెడ్డిని సిఎం గా చేసే బాధ్యత మనమందరం తీసుకోవాలని.. అలా ఫ్లో లో అనేశారు. అన్నారు సరే.. ఆ మాటను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయలేదు. జగన్ ని సిఎం గా చేయాలని స్వయంగా అనిత అనడం ఏంటి.. తూచ్ ఇది కూడా ఎడిటింగ్ అనుకుంటే పొరబాటే. ఆమె పలికిన ఆ మాటలలో ఎలాంటి మార్ఫింగ్ లేదు. స్వయంగా ఆమె నోటి నుంచే జాలువారింది. అయితే గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జగన్ మోహన్ రెడ్డిని సిఎం గా చేసే బాధ్యత మనమందరం తీసుకోవాలన్న మాటలు గతంలో వైరల్ అయ్యాయి. కానీ అది మార్ఫింగ్ చేసిన వీడియొ. కానీ నేడు ఆమె అన్న మాటలు మాత్రం అక్షరాలా నిజం. ప్రస్తుతం ఆమె వీడియొని కూడా టిడిపి సోషల్ మీడియా పేజ్ లో నుంచి కూడా డిలెట్ చేశారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు ప్రముఖ న్యూస్ ఛానెల్స్ లో లైవ్ ప్లే అవుతోంది. గతంలో ఒక వీడియొ ని మార్ఫింగ్ చేసినందుకు చెప్పుతో కోడతా.. కేసులు పెడతా అంటూ.. నోరుపారేసుకున్నారు.. అనిత. మరి ఇప్పుడు ఈమెను ఏ చెప్పుతో కొట్టాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నా ప్రాణం పోయినా, నిద్రలో లేపి అడిగినా జగన్ ని సిఎం చేయాలని తన నోటి నుంచి రానే రాదని ఏదో గొప్పలు చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.