ఓటుకు నోటు కోసం రాష్ట్రాన్ని బాబు నాశనం చేశాడు నోరుజారిన వంగలపూడి అనిత అమరావతి టీడీపీ కార్యాలయానికి సీఐడీ నోటీసులు

1.విశాఖ స్టీల్ ప్లాన్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం..
నాడు సభలో ప్రధాని మోదీకి సీఎం జగన్ ఇదే చెప్పారన్న మంత్రి అమర్నాథ్‌.

2.సీపీఐకి జాతీయ పార్టీ హోదా రద్దు..
ఈసీ తీనుకున్న నిర్ణయం తమను నిరుత్సాహపరచలేదన్న సీపీఐ నేత నారాయణ.

3.తన తల్లిని వివేకా లైంగికంగా వేధించడం వల్లే సునీల్ యాదవ్ హత్య చేశాడు..
భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టులో సంచలన వ్యాఖ్యలు.

4.ఓటుకు నోటు కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు కొన్ని లక్షల కోట్ల ఆస్తులను నాశనం చేశారు..
బాబు ఐదేళ్లలో ఏం చేశారో జనంలోకి వెళ్లి చెప్పే ధైర్యముందా? అని నిలదీశిన మంత్రి రోజా.

5.చంద్రబాబుకు భారీ షాక్..
అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు.. చైతన్య రథం పత్రికలో వస్తున్న వార్తా కథనాలపై సీఐడీ ఆరా.

6.దళిత బిడ్డల్ని స్వార్థ రాజకీయాలకు బలిచేస్తున్న జగన్.. వారికి మేనమామ అవుతాడా?..
కోడికత్తి కేసు బాధితుడైన దళితబిడ్డ శ్రీనివాస్‌కు జగన్ ఎప్పుడు విముక్తి కల్పిస్తారన్నటీడీపీ నేత జవహర్.

7. తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేశ్ పాదయాత్ర..
డప్పు చప్పుళ్లకు స్టెప్పులు వేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.

8.లోకేశ్ పాదయాత్రలో రోజుకో కామెడీ..
ఏమీ రాని దద్దమ్మ, ఒక్క చోట కూడా గెలవని వ్యక్తి సీఎం జగన్‌ ను విమర్శిస్తున్నారని మండిపడ్డ లక్ష్మీపార్వతి..

9.నోరుజారిన టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత..
జగన్ మోహన్ రెడ్డిని సీఎం గా చేసే బాధ్యత మనందరిది అంటూ లైవ్ వ్యాఖ్యలు… సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు.

10.మారేడుమిల్లిలో అధికార పార్టీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చేదు అనుభవం..
బోయ, వాల్మీకీ సహా అనుబంధ కులాలను ఎస్టీల్లో చేర్చాలంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 52ను రద్దు చేయాలని డిమాండ్.