టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నోరుజారారు. అది కూడా టిడిపి కంచుకోట అయిన బెజవాడ నడిబొడ్డులో పార్టీ పరువు తీశారు. ఆత్రమో ఏమో కానీ.. చంద్రబాబు చేసే వ్యవహారం పార్టీని అభాసుపాలు చేస్తున్నారు. నేడు మచిలీపట్నం పర్యటనలో భాగంగా.. చంద్రబాబు విజయవాడ నగరంలోని రాణిగారి తోటకు చేరుకొని అక్కడే నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆక్కడ ప్రసంగిస్తూ.. సైకిల్ పోవాలి అంటూ నోరు జారారు. మళ్ళీ దానిని కవర్ చేస్తూ జై ఎన్టీఆర్అంటూ వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఇలానే సైకిల్ పోవాలి.. సైకో రావాలంటూ.. చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి. ఆయనతో పాటు తమ్ముళ్ళు కూడా ఫ్లోలో సైకిల్ పోవాలి అన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా బెజవాడలో చంద్రబాబు నోరుజారడం చర్చనీయాంశంగా మారింది. ఇకబాబుగారే అనుకుంటే.. ఆయన పార్టీ క్యాడర్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకట్రాజు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిర్వహించిన ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమ0లో ప్రత్తిపాటి పుల్లారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొరపాటున ఫ్లోలో సైకిల్ పోవాలి అంటూ నినాదాలు చేశారు. పుల్లారావు నినాదాలతో అక్కడున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న మాజీ మంత్రి.. సారీ, సారీ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదండీ.. చంద్రబాబు, ఆయన క్యాడర్ వ్యవహారం. ఇలా నోరుకూడ తిరగని స్లోగన్ లు చేయడం ఎందుకు.. నలుగురిలో పరువు పోగొట్టుకోవడం ఎందుకో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.