మళ్ళీ నోరు జారిన చంద్రబాబు.. మార్గదర్శిలో అక్రమాలు నిజం.. పవన్ పై కీలక వ్యాఖ్యలు

1. తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల అంశంలో కీలక పరిణామం..
బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని తెలంగాణ హైకోర్టులో కేంద్రం పిటిషన్.

2.ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా..?
మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సీరియస్.

3.గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత?
బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా? అంటూ మార్కాపురం సభలో సిఎం జగన్ సవాల్.

4. ‘మార్గదర్శిలో అక్రమాలు నిజం.. ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోదు’..
మార్గదర్శి చిట్ ఫండ్లో అక్రమాలు జరిగాయని సీఐడీ ఏడీజీ సంజయ్ సంచలన వ్యాఖ్యలు.

5.నూతనంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం..
వీరితో ప్రమాణం చేయించిన శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు.

6.’కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వెనక కూడా చంద్రబాబే!’..
సీనియర్ జర్నలిస్టు దేవుల పల్లి అమర్ సంచలన వ్యాఖ్యలు.

7.పవన్ కల్యాణ్ ఓ శక్తి.. ఆయన అనుకుంటే ఏదైనా అయిపోతుంది. కానీ ఏదీ అనుకోడు..
పార్టీలను నమ్ముకుని రాజకీయం చేయడం వల్లే పవన్ సీఎం కాలేకపోతున్నారని శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు.

8.జగన్‌ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్‌ గడ్డ..
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు.. జగన్ క్యాన్సర్‌ లాంటివాడని, ప్రజలను పట్టిపీడిస్తున్నాడని విమర్శ.

9.దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులు..
టాప్ లో వైఎస్ జగన్ ఉన్నారని ఏడీఆర్ నివేదిక వెల్లడి.

10.ఏపీలో ప్రభుత్వం లేదు.. కార్పొరేట్ కంపెనీలే ఉన్నాయి..
విభజన హామీల అమలు సాధ్యం కాదని సీఎంగా ఉన్నప్పుడే చెప్పానన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి.