1.మార్గదర్శి హెడ్ ఆఫీస్లో కొనసాగుతున్న సీఐడీ సోదాలు..
బ్యాలెన్స్ షీట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న అధికారులు.
2.ఆరో రోజూ కొనసాగుతున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమ౦..
ప్రతి ఇంటా విశ్వాసం.. కార్యక్రమానికి విశేష స్పందన.
3.తెలంగాణలో వుండి కాదు.. ఏపీకి వచ్చి మాట్లాడు..
హరీశ్ రావుకు మంత్రి అప్పలరాజు సవాల్.
4.ఏపీ గురించి మాట్లాడడానికి మీకేం సంబంధం..
రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడడానికి హరీష్ రావు ఎవరని నిలదీసిన బొత్స సత్యనారాయణ.
5.రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయ౦..
మంత్రి చెల్లుబోయిన నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకి కసరత్తు.
6.ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం..
బాణసంచా కారణంగా అగ్నిప్రమాదంలో ముగ్గురి మృతి.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.
7.ముఖ్యమంత్రి జగన్ మొన్నటి వరకూ సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు… ఇప్పుడు సంచి పట్టుకొని స్టిక్కర్లు అతికించుకుంటున్నాడు..
68 రోజుల పాదయాత్రకే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని లోకేష్ విసుర్లు.
8.కొడాలి నాని టీడీపీని వాడుకుని మోసం చేశారు..
ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమేనన్న నందమూరి రామకృష్ణ.
9. నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించిన చంద్రబాబు..
ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళి.
10. చెత్త మీద పన్నువేసిన చెత్త సీఎం జగన్…
అవసరానికి వాడుకుని అమ్మను చెల్లిని తరిమేశాడని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపణ.