జగన్ స్టిక్కర్ ను పీకిన కుక్క కేసు పెట్టిన టీడీపీ మహిళా నేత ఇదేం చిల్లర రాజకీయం

మా నమ్మకం నువ్వే జగనన్న పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్టిక్కర్ల కార్యక్రమం రచ్చకెక్కింది. టిడిపి నేతలు జగన్ ఇమేజ్ ని అమాంతం పెంచేస్తున్నారు. జగన్ స్టిక్కర్ ను కుక్క పీకివేయడం తమను ఎంతగానో కలచివేసిందని, ఈ ఉదంతంపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ. కుక్క తనంతట తానే స్టిక్కర్‌ను పీకిందా.. లేక ఎవరైనా ట్రైనింగ్‌ ఇచ్చి పీకించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పైగా బోండా ఉమా ఆదేశాల మేరకు కేసు పెట్టానని దాసరి ఉదయశ్రీ బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఇదేంటి కుక్కపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏంటని.. ఆశ్చర్య పోతున్నారా..? ఇది టిడిపి చేస్తున్న చిల్లర రాజకీయం అంటున్నారు నెటిజన్లు. ఇక అసలు విషయానికొస్తే.. జగన్ స్టిక్కర్ లు తమ ఇళ్లకు బలవంతంగా అంటించడం టిడిపి వారికి నచ్చలేదట.. ఇదేమని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై పోలీస్ కేసులు పెట్టారట. సో.. దానికి నిరసనగా టిడిపి వారు కుక్కపై కేసు పెట్టి.. దానిని కూడా జైలులో పెట్టి .. తగు చర్యలు తీసుకోవాలని.. టిడిపి నాయకులు అంటున్నమాట. అయితే.. వైసీపీ వారు ఎం చెప్తున్నారు అంటే.. మా నమ్మకం నువ్వే జగనన్న అనే స్టిక్కర్ ను ప్రజల ఇష్టపూర్వకంగానే తమ ఇళ్లకు అంటిస్తున్నామని అంటున్నారు. ఇదంతా టిడిపి కుట్ర రాజకీయమని, ఎం చేయలేక ఇలా కుక్కలపై కేసు పెట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.