పవన్ కళ్యాణ్ నిజంగానే వీకెండ్ పొలిటీషనా..? ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ ఉచ్చరిస్తున్నారా..? ఆయన కేవలం సినిమాలలో మాత్రమే హీరో.. రాజకీయాలలో జీరోనా..? వారాహితో రోడ్డుపైకి వస్తా.. నన్నెవడ్రా ఆపేది.. అంటూ బిల్డప్ లు ఇచ్చి.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు..? పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇంకా మొదలుకాకపోవడంతో.. ప్రస్తుతం రాజకీయాలలో ఇలాంటి ప్రశ్నలే చర్చనీయాంశంగా మారాయి. నిజానికి వారాహి యాత్ర దసరా నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. అప్పటి నుంచి వాయిదాలు పడుతూనే ఉంది. దీనికి గల కారణాలు అయితే ఎవ్వరికీ తెలియవు. అయితే.. ఏప్రిల్ నుంచి వారాహి యాత్ర స్టార్ అవుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏప్రిల్ వచ్చినా ఇంకా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో.. పలు రకాల చర్చలకు తావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన నాటి నుండి మరింత సైలెంట్ అయ్యారు. చంద్రబాబును కూడా కలుపుకొని పోవాలని ఢిల్లీ పెద్దలకు చెప్పిన పవన్ కి బీజేపీ అధిష్టాన౦ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదా..? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంటే.. చంద్రబాబుని టార్గెట్ గా చేసుకొని ఏపీలో రాజకీయం నడిపించాలని ఢిల్లీ పెద్దలు పవన్ కి దిశా నిర్దేశం చేశారా..? అన్న వార్తలు వస్తున్నాయి. పొత్తుల కోసం అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో పవన్ నలిగిపోతున్నారా..? అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న.
అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోన్న వార్త ఏంటంటే. ఏపీలో ప్రస్తుతం రెండే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ మాంచి ఫామ్ లో ఉంది. కానీ టిడిపి మాత్రం చాలా కష్టాల్లో మునిగి తేలుతోంది. ఎలాగో.. బీజేపీ- టిడిపి లకు మధ్య వైరం ఉంది. వైసీపీతో మాత్రం బీజేపీ సన్నిహితంగానే ఉంటుంది. సో.. ఏపీలో టిడిపి ని దెబ్బకొట్టి.. బీజేపీ ఎదగాలని ప్లాన్ వేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు పవన్ కళ్యాణ్ ను పావుగా వాడుకోవాలని చూస్తున్నారని కూడా గుసగుసలు వస్తున్నాయి. అందుకే బీజేపీ నాయకులు పవన్ తోనే మా పొత్తు అని పదేపదే అంటున్నది. అందుకే చంద్రబాబును రాజకీయంగా బాలహీనపరిస్తే.. బీజేపీ బలపడుతోందని ఢిల్లీ పెద్దల ఆశ. మరి అది సాధ్యమయ్యే పనేనా అంటే.. అంత ఈజీ కాదనే చెప్పాలి. మరి ఎలాంటి పొత్తులు లేకుండా ఆయా రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో భరిలోకి దిగితే.. కళ్ళుమూసుకొని అధికారాన్ని మళ్ళీ వైసీపీ చేతిలో పెట్టాల్సి వస్తుందని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి చాలా బాగా తెలుసనే చెప్పాలి. పొత్తులతో వస్తే.. టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉండొచ్చేమో గానీ.. విడివిడిగా వస్తే.. టిడిపి , జనసేన పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని పుబ్లిక్ చర్చించుకుంటున్నారు.
అసలు.. ఈ పొత్తులకు, పవన్ వారాహికి సంబందం ఏంటని భావిస్తున్నారా..? అసలైన లింకు ఇక్కడే ఉందండోయ్. టిడిపి తో పొత్తుకు బీజేపీ సముఖత చూపట్లేదని చెప్పవచ్చు. కానీ అధికారం కోసం చంద్రబాబు పొత్తులకోసం తహతహలాడుతున్నారు. అందుకోసం పవన్ కూడా తెగ కష్టపడుతున్నారనుకోండి. అయినప్పటికీ.. ఢిల్లీ పెద్దలు మాత్రం టిడిపి తో పొత్తుకు నో చెప్పారని సమాచారం. గతంలో పవన్ బీజేపీని రోడ్ మ్యాప్ అడిగినా అధిష్టానం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అంటున్నారు.. విశ్లేషకులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరాహి యాత్ర స్టార్ట్ చేయాలంటే..ముందు పొత్తులపై ఒక క్లారిటీ రావాలి. అప్పుడే పవన్ తన రోడ్ షోలో తమ వ్యూహాలకు అనుగుణంగా వ్యవహరించడానికి అవకాశం ఉంది. వీటన్నీటిని బట్టి చూస్తే.. పవన్ వారాహి ఇప్పట్లో అప్పుడే కదిలే పరిస్థితులు లేవనే చెప్పాలి. మరి పవన్ తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.