1.నమ్మకానికి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయితే.. వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు..
బందరును హైదరాబాద్ మించిన సిటీ చేస్తానన్నావ్ చేశావా.. అని ప్రశ్నించిన పేర్ని నాని.
2 రాష్ట్ర రాజకీయాల్లో అత్యధిక ధనవంతుడు చంద్రబాబు..
668 కోట్లతో ఏపీలో మొదటి స్థానం, దేశంలో 3వ స్థానంలో ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ వెల్లడి.
3.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు..
ముందు అర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ స్పష్టం.
4.జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకువస్తానని చెప్పగలరా..
చంద్రబాబుకు పేర్ని నాని సవాల్.
5.విశాఖ ఉక్కు గురించి మాట్లాడింది మేమే… ఏపీ ప్రభుత్వం, విపక్షం నోరు విప్పలేదు..
కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందన్న హరీశ్ రావు.
6.టీడీపీకి సుప్రీంలో షాక్..
అమరావతి పేదల ఇళ్ల స్థలాల కేసులో పిటిషన్ ఉపసంహరణ..
7.అప్పుల్లో అభివృద్ధి సాధించాం.. అదానీని అభివృద్ధి చేశాం.. ఈ విషయం హరీశ్ రావుకు తెలీదా?..
సీపీఐ రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు
8. తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు..
కృషి, పట్టుదలతో మహోన్నత వ్యక్తిగా ఆదర్శంగా నిలిచారని ఎన్టీఆర్ ని కొనియాడిన చంద్రబాబు.
9.2001లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేస్తే.. దానిని రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నారు..
దళితుల్లో ఉన్న 62 ఉప కులాలకు న్యాయం చేస్తామని లోకేష్ హామీ.
10.విశాఖ ఉక్కు అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన పరిశ్రమ..
రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి లేదని పవన్ కళ్యాణ్ విమర్శ.