మరో బాం* పేల్చిన కేంద్రం గుడివాడ రోడ్ షో కమ్మ షో చంద్రబాబుతో చర్చకు సిద్ధం

1. నేడు అంబేడ్కర్ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం జగన్..
దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటూ కొనియాడిన సిఎం.

2. జగనన్నే మా భవిషత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన..
ఏడో రోజు ముగిసే సమయానికి 55 లక్షల కుటుంబాల సర్వే పూర్తి కాగా, జగన్ ప్రభుత్వానికి మద్దతుగా 45లక్షలకు పైగా మిస్డ్ కాల్స్.

3.మరో బాంబ్ పేల్చిన కేంద్రం..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని తాజాగా వెల్లడి.

4.కేంద్ర మంత్రి పంకజ్ జైన్ తో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో భేటీ..
పెట్రోలియం చమురు మరియు సహజ వాయువు రంగానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చలు.

5.టిడిపి హయాంలో బాబు 14 ఏళ్లు గుడివాడను గాలికి వదిలేశాడు..
గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం అంటూ కొడాలి నాని సవాల్.

6.గుడివాడ రోడ్ షో కమ్మ షో అని నీచమైన ప్రచారం చేస్తున్నారు..
సీటు కోసం చంద్రబాబు కాళ్ల దగ్గర పడిన విషయం కొడాలి నానికి గుర్తు లేదా అని ప్రశ్నించిన కొల్లు రవీంద్ర.

7.తనకు ఓట్లేసిన దళితులపైనే జగన్ దాడులు చేయిస్తున్నారు..
స్వాతంత్ర్యం వచ్చాక చరిత్రలో ఎన్నడూ జరగనన్ని దాడులు దళితులపై ఇప్పుడే జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపణ.

8.స్టిక్కర్లను ఇళ్లకు కాకుండా.. వైసీపీ ఎమ్మెల్యేల ముఖాలకు అతికించుకుంటే బాగుంటుంది..
ఎమ్మెల్యేలు ఇంటింటికీ వచ్చి బలవంతంగా స్టిక్కర్లు అతికిస్తున్నారన్న అఖిలప్రియ

9.జగన్‌ సర్కార్‌ తీరుపై బీజేపీ సీరియస్‌గా ఉంది..
ఏపీలో రాబోయేది బీజేపీ కూటమి ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ జోస్యం.

10.ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు..
విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రికి సీబీఐ నోటీసులు.