1.ఈనెల 19న సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన..
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.
2. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా..
ఉదయం 10 గంటల 30 ని.లకు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ స్పష్టం.
3.పవన్ కు హఠాత్తుగా వారిపై ప్రేమ ఎందుకు పుట్టుకువచ్చింది..
పవన్ కల్యాణ్ ఎవరికి వక్తలా పుచ్చుకున్నాడు..?. ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు..? అంటూ ప్రశ్నించిన పేర్ని నాని.
4.అవినాశ్ రెడ్డిని అవసరమైతే అదుపులోకి తీసుకుంటామని కోర్టుకు తెలిపిన సీబీఐ..
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సహనిందితుడిగా చేర్చిన సీబీఐ అధికారులు.
5.ఏపీ మేలు కోరి మాట్లాడానే తప్ప అక్కడి ప్రజలను తిట్టలేదు..
తెలంగాణలో పథకాలు బాగున్నాయని చెప్పానే తప్ప తప్పుగా మాట్లాడలేదని హరీశ్ రావు వెల్లడి.
6. ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళ్తారని.. కానీ ఈ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశారు..
రాష్ట్రంలో ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి కోర్టు దొంగ అని లోకేశ్ విమర్శ.
7.చంద్రబాబు కారణంగానే రాష్ట్రానికి రాజధాని సమస్య వచ్చింది..
ఆయనకి వయసైపోయింది.. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్ తోకలు కట్ చేస్తామని ఎమ్మెల్యే పిన్నెల్లి ఎద్దేవా.
8. వైఎస్ జగన్, అవినాష్ రెడ్డిల నుంచి ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉంది..
తాను అప్రూవర్‌గా మారిన సమయంలో అవినాష్ రెడ్డి లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని దస్తగిరి కీలక వ్యాఖ్యలు.
9.కోడికత్తి కేసు విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా..
‘రావాలి జగన్.. చెప్పాలి సాక్ష్యం’అంటూ నిందితుడు తరఫు న్యాయవాది అబ్దుల్ సలీమ్ సంచలన వ్యాఖ్యలు.
10.మంత్రి జోగి రమేష్ అనుచరులు చేస్తున్న మట్టి దోపిడీపై కలెక్టర్‌కు సీపీఐ రామకృష్ణ ఫిర్యాదు..
మట్టి తవ్వకాలతో యధేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని ఆధారాలు అందజేసిన రామకృష్ణ.