బర్త్ డే రోజున బాబుకి షాక్ ఇచ్చిన సీఎం జగన్ ఢిల్లీలో చక్రం తిప్పిన వైసీపీ టీడీపీకి ఇదేం ఖర్మ

చంద్రబాబు రాజకీయ చాణక్యుడు, అపర మేధావి.. ఆయన 40 ఏళ్ల రాజకీయాలలో ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకున్నారు. దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, తిమ్మిని బమ్మిని చేయడ౦ ఎవరైనా ఆయన తర్వాతనే అని చెప్పాలి. అందరూ అంటోన్న విధంగా.. మామకు వెన్నుపోటు పొడిచి.. అన్యాయంగా పార్టీని లాక్కోవడం దగ్గర నుంచి.. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల వరకు ఇలా రాజకీయంగా ఏది చేయాలన్నా ఆయన తర్వాతే, ఏదైనా మస్కా కొట్టించాలన్నా కూడా ఆయన తర్వాతనే. ఇదే మాట బయట ప్రజలు కూడా అంటున్నారు. 14 ఏళ్ల పాటు సీఎంగా, 13 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుకి 2019 ఎన్నికల ఫలితాలతో దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతోంది. ఇక వచ్చే ఎన్నికలు చంద్రబాబుకి అత్యంత కీలకం.. కీలకం మాత్రమే కాదు.. పరువు ప్రతిష్టలతో కూడుకొని ఉన్నాయి. తన భార్యను అవమానించారని.. అసెంబ్లీ నుంచి బయటకొచ్చి ఏడుస్తూ.. యమ యాక్టింగ్ చేశారు. ఈ మాటలు మేము అంటున్నవి కాదు.. స్వయంగా రాష్ట్ర ప్రజలే తమ నోట అంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. రాజకీయంగా ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించిన చంద్రబాబుకు ఇప్పుడు 2024 ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం. ఈ ఎన్నికలే చంద్రబాబుకి చివరి ఎన్నికలు. ఆ మాట స్వయంగా బాబుగారే రోడ్డు షోలో అన్నారు. పరిస్థితులు రోజురోజుకి బాబు చేజారిపోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలలో అన్ని స్థానాలు మావే అని ఇప్పటి వరకు ఏ పార్టీ అధినాయకుడు ప్రకటన చేసిన దాఖలాలు లేవనే చెప్పాలి. వై నాట్ 175 అంటూ.. వైసీపీ శ్రేణులకు సిఎం జగన్ మాంచి ఊపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బాబుని మట్టి కరిపించడానికి.. ఏకంగా కుప్పంలో కూడా బాబుని ఓడించడానికి సిఎం జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరో వైపు సిఎం జగన్ మూడు రాజధానుల వ్యూహంతో గట్టి పట్టు పట్టి ఉన్నారు. ఈ సెప్టెంబర్ లో విశాఖ నుంచే పాలన సాగిస్తామని సిఎం జగన్ నిన్నటి వేళ మరో బాంబ్ పేల్చారు. వికేంద్రీకరణకే తాము కట్టుబడి ఉన్నామని, ఎలాగైనా మూడు రాజధానులను సాధించి తీరుతామని వైసీపీ గట్టి నమ్మకంతో ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటికీ అమరావతే రాజధాని అంటూ.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఎలాగో మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులతో భరిలోకి దిగాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెగ ఆరాట పడిపోతున్నారు. కానీ పొత్తుల అంశంపై క్లారిటీ రాలేదు. ఆ క్లారిటీ ఎందుకు రాలేదంటే.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సానుకూలత చూపట్లేదు. ఇకపై చూపాడు కూడా. ఎందుకంటే.. చాంద్రబాబుది ఎలాంటి క్రిమినల్ మైండ్ అనేది 2019 ఎన్నికలకు ముందే బీజేపీ పసిగట్టింది. సో.. మళ్ళీ టిడిపి తో కలిసి ,చంద్రబాబుకి అధికారం కట్టబెట్టి.. ఆయన నోట మళ్ళీ తిట్టించుకోవాలని బీజేపీ అధిష్టానం అస్సలు అనుకోవడం లేదు. టిడిపిని కూడా కలుపుకుపోదామని మొన్న పవన్ కళ్యాణ్ డిల్లీ వెళ్ళి.. డిల్లీ పెద్దలతో చెప్తే.. అందుకు వారు నో చెప్తే.. పవన్ నిరాశతో వెనుదిరిగారు. పొత్తులకు బీజేపీ ఎలాగో ఒప్పుకోదు. పొత్తులు లేకపోతే.. టీడీపీ గెలవదన్న సంగతి బాబుకి కూడా తెలుసు.
ప్రస్తుతం బీజేపీ – వైసీపీ మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంది. ఆ సంబంధం మున్ముందు కూడా కొనసాగుతుందని కూడా వైసీపీ నాయకులు అంటున్నారు.