తాడిపత్రిలో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంది. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతుంది పాత తెలుగుదేశం కాదని, కేవలం జేసీ తెలుగుదేశం అంటూ.. తాడిపత్రికి చెందిన TDP నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. జేసీ ప్రభాకర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతామని తొడకొట్టి సవాల్ చేశారు TDP నేత జిలాన్. నాడు కాంగ్రెసు పార్టీ అధికారంలో లేకపోతే.. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వీళ్ళని నమ్మాలా..? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వీరు అధికారం కోసం తహతహలాడతారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎంత సేపు అధికారం ఉండాల, చుట్టూ పోలీసులు ఉండాలి.. ఇప్పుడు అధికారం లేదని తెగ గుంజుకుంటున్నారని TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కిందిస్థాయి నాయకులను జేసీ అస్సలు లెక్కచేయరని, కనీసం విలువ కూడా ఇవ్వరని TDP నేత తమ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జేసీకి టికెట్ ఇస్తే.. ఓటు వేయమని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాగైనా ఓడించి తీరుతామని తొడకొట్టి మరీ సవాల్ చేశారు. మరో వైపు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి హైడ్రామాకి తెరతీశారు. తాడిపత్రి మున్సిపాలిటీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ అర్థరాత్రి సమయంలో మున్సిపల్ కార్యాలయంలో మంచం వేసుకొని పడుకొని నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసే యత్నం చేనప్పటికీ జేసీ పోలీసులను లెక్కకూడా చేయకుండా వ్యవహరించారు. దీంతో తాడిపత్రిలో నేటి ఉదయం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గతంలో ఇసుక రీచ్ ల వద్ద కూడా
జేసీ ఇలానే రచ్చ చేసి చివరికి అరెస్ట్ అయ్యారు. ఇక ఈ నేపధ్యంలోనే జేసీ మరోసారి అరెస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.