ఉండవల్లి అరుణ్ కుమార్.. అనర్గలగా మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి, ఏదైనా ముక్కుసూటిగా ప్రశ్నించే రాజకీయ నేత.వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎం గా , కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ఆ తర్వాత రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ.. తరుచూ రాజకీయపరమైన అంశాలు మాట్లాడుతూ.. ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటారు.
ప్రశ్నించాలనుకుంటే.. అధికార పార్టీ అని చూడారు, ప్రతిపక్ష పార్టీ అని చూడారు. ఎవరు తప్పు చేసినా తనాడైలా శైలిలో కౌంటర్లు వేస్తారు. అలాంటి వ్యక్తి.. జగన్ సర్కారుకి జై కొట్టారంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది.మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చెరబోతున్నారా..? చంద్రబాబు – రామోజీ ఇద్దరూ తోడు దొంగలా..? నాడు ఉండవల్లి ఓటమికి కారణం రామోజీనేనా..? ఉండవల్లిపై ఈనాడులో తప్పుడు రాతలు రాయించంది చంద్రబాబేనా..? ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయనని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకొనున్నారని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన విషయంలో చంద్రబాబు తన స్వార్ధం తాను చూసుకున్నారని, కానీ సిఎం జగన్ అలా చేయలేదని రాష్ట్రం కోసం , రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ తమ అభిప్రాయ వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంపై తనకు మద్దతుగా సిఎం జగన్ అఫిడవిట్ వేశారని, అలాంటప్పుడు జగన్ ను విమర్శించే అర్హత తనకు లేదన్నారు ఉండవల్లి. రామోజీరావుని, చంద్రబాబుని ఓ రేంజ్ లో ఏకిపారేశారు. అయితే.. ఇప్పుడు ప్రధానంగా ఓ ప్రచారం అయితే సాగుతోంది.
ఉండవల్లి అరుణ్ కుమార్ కి సిఎం జగన్ భారీ ఆఫర్ అంటూ.. వార్తలు వస్తున్నాయి. పిలిచి పదవి ఇస్తే.. ఉండవల్లి వైసీపీలోకి రాకుండా ఉంటారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సిఎం జగన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇ సపోర్ట్ గా నిలిచారు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్
ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.