1. శింగనమల నియోజకవర్గానికి cm జగన్ వరాల జల్లు..
చాగల్లు రిజర్వాయర్ ముంపు గ్రామాలైన ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 168 కోట్లు మంజూరు.
2.చంద్రబాబు ఏపీలో పుట్టడం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం..
నీ కుయుక్తులు ప్రజలందరికీ తెలుసు.. ఇకపై నీ ఆటలుసాగవన్న కురసాల కన్నబాబు.
3.జనసేన పార్టీ కూడా మార్గదర్శికే మద్దతిస్తోంది..
టీడీపీ ముసుగు తొలిగింది.. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలోనైనా చర్చకు సిద్దం అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్.
4.వైద్య, ఆరోగ్య రంగంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉంది..
ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు స్పష్టం.
5.సిఎం జగన్ మాటలు చెప్పే నాయకుడిలా కాదు..
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేస్తూ సీఎం జగన్ ప్రజల గుండెల్లో చొచ్చుకుపోయారని ఎంపీ కృష్ణయ్య వ్యాఖ్య.
6.రైతులకు జగన్ బిగిస్తున్న మోటార్లను పగులకొట్టండి..
రైతుల రాజ్యం తెస్తానన్న జగన్ రైతులు లేని రాజ్యం తెచ్చాడు అంటూ లోకేష్ ఆరోపణలు.
7.వైసీపీ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ కమిటీని నియమించిన బీజేపీ..
ఈ కమిటీ మార్గదర్శకులుగా దగ్గుబాటి పురందేశ్వరి, వై. సత్యకుమార్ నియామకం.
8.ఏపీ భవన్ విభజనపై ముగిసిన కేంద్ర హోంశాఖ సమావేశం..
కుదరని ఏకాభిప్రాయం..
9.వివేకా కేసులో అవినాష్ రెడ్డి గురించి జిల్లా అంతా తెలుసు..
అరెస్ట్ ఖాయమన్న టీడీపీ నేత బీటెక్ రవి.
10.చంద్రబాబు రోడ్‌షోలో గాయపడిన పార్టీ కార్యకర్త మృతి..
అమరావతి రోడ్డు షోలో రెండు బైక్ లు ఒకదానికొకటి ఢీకొని అకస్మాత్తుగా మంటలు చెలరేగి గాయపడిన వ్యక్తి.