మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ తీరును గమనిస్తే.. ఆయన సిద్దాంతాలకు వ్యతిరేకంగా పయనిస్తున్నారని వాదనలు వస్తున్నాయి. రాజకీయాలలో అన్యాయాలను ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్.. అసలు ఆ ఊసే లేదేందుకు.? చంద్రబాబు ఏది చెప్తే దానికి వత్తాసు పలకడం ఒక్కటే పవన్ కి తెలిసిన రాజకీయమా.? చేతిలో స్క్రిప్ట్ లేకుండా పవన్ స్వతహాగా మాట్లాడలేరా.? అమాయక ప్రజల సొమ్మును రామోజీ మింగేస్తే.. పవన్ ప్రశ్నించకుండా రామోజీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు.? అంటే ఇది కూడా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టేనా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ తీరుపై ప్రశ్నించారు. టీడీపీలో హాయంలో ఎవరెవరు స్కాంలు చేసారు..ఎవరిని రక్షించారో.. ఎవరి స్కాంలు ఏంటో చెప్పటానికి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఉండవల్లి చెప్పుకొచ్చారు. అయితే.. వైసీపీ పైన వ్యతిరేకతతోనే జనసేన మార్గదర్శికి మద్దతుగా నిలుస్తోందని ఉండవల్లి వివరించారు. కొత్త నేతలు రావాలనే ఉద్దేశంతో తాను కొన్ని టిప్స్ పవన్ కు ఇవ్వాలని భావించానని చెప్పారు. కానీ పవన్ రెండు చోట్ల ఓడిపోవటంతో ఆలోచనలు ముందుకు వెళ్లలేదన్నారు. ఇప్పుడు జనసేన కూడా టీడీపీతో కలిసి మార్గదర్శి వ్యవహారంలో రామోజీకి మద్దతు ఇస్తోందని చెప్పుకొచ్చారు. తనకు మార్గదర్శి కేసు వ్యవహారంతో పాటుగా రాష్ట్ర విభజన కేసు మినహా తనకు ఏమీ పని లేదని ఉండవల్లి తేల్చి చెప్పారు. టీడీపీతో చర్చకు తాను అన్ని అంశాల పైన చర్చకు సిద్దమని ఉండవల్లి స్పష్టం చేసారు.