రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు రేపుతున్న వైఎస్ వివేకా కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది..? ఓ ప్లాన్ ప్రకారమే.. ఎంపీ అవినాష్ రెడ్డిని ఇరికించాలని కుట్ర జరిగిందా..? హత్య జరిగినప్పుడు స్పాట్ లో ఎవరెవరు ఉన్నారు..? హత్యా ఘటన విశయం ఎవరికి ముందుగా తెలిసింది..? వివేకా మరణించారని శివప్రకాష్ రెడ్డికి ఎవరు సమాచారం అందించారు..? వివేకా మరణించారని మాజీ మంత్రి, టీడీపీ నేతకు ముందుగా తెలియాల్సిన అవసరం ఏమొచ్చింది..? దీని వెనుక టీడీపీ నేతల కుట్ర దాగు ఉందా..? పైగా అప్పుడు ఆదినారాయణ రెడ్డి వివేకాకు రాజకీయ ప్రత్యర్ధి. వివేకా రాసిన రక్తపు మరకలున్న లేఖను దాయాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఆ లేఖ గురించి ఆ రోజు ఎంపీ అవినాష్ రెడ్డికి చెప్పకుండా ఎందుకు చెప్పలేదు..? అసలు ఆ లేఖలో డాగి ఉన్న రహస్యం ఏంటి..? అసలు ఎం జరిగిందో ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా వీడియో రిలీజ్ చేశారు. వివేకా మరణించిన ఉదయం 6.30 నిమిషాలకి ఎంపీ అవినాష్ రెడ్డి కాల్ వచ్చింది. వివేకా మరణించినట్లు శివప్రకాష్ రెడ్డి తనకు చెప్పారని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. బావ ఇంటికి వెళ్లమని చెప్పారు.. ఇప్పుడు వివేకా ఇంటికి ఎందుకు అని అడిగాను
, బావ నో మోర్ అని శివప్రకాష్ రెడ్డి చెప్పారు. హుటాహుటిన వివేకా ఇంటికి వెళ్లా.. హుటాహుటిన వివేకా ఇంటికి వెళ్లా.. వివేకా డెడ్ బాడీ బాత్ రూమ్ లో ఉందని పీఏ కృష్ణారెడ్డి చెప్పాడు. రూమ్ లో వివేకా రాసిన లేఖ, ఫోన్ ఉన్నాయని పీఏ కృష్ణారెడ్డి చెప్పాడు. ఆ లెటర్ ,ఫోన్ ను దాచిపెట్టాలని సునీత రెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి పీఏ కి చెప్పాడు. అప్పుడు పీఏ కృష్ణారెడ్డి ఆ లేఖను దాచి పెట్టాడు. వివేకాది హత్య అని చెప్పడానికి లెటర్ ముఖ్యమైన ఆధారం అని ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు. సీబీఐ విచారణ అధికారి రామ్ సింగ్ ఆ లెటర్ ను పక్కన పెట్టాలా చూశారు. లెటర్ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదని అవినాష్ ప్రశ్నించారు. సీబీఐ అధికారి రాంసింగ్ ఎవరిని కాపాడుతున్నారు ?.అంటూ అవినాష్ అనుమాన వ్యక్తం చేశారు. అసలు ఆ లేఖను అవినాష్ కి చూపించి ఉంటే.. అది హత్యే అని తెలిసేది..ఎవరూ మృతదేహాన్ని తాకేవారు కాదుగా? చంద్రబాబు హయాంలో జరిగిన విచారణలో అసలు లేఖ ప్రస్తావనే లేదెందుకు?సునీత సీబీఐకి తొలిసారి ఇచ్చిన స్టేట్ మెంట్ కి, రెండవసారి ఇచ్చిన స్టేట్ మెంట్ కి చాలా తేడాలున్నాయని అవినాష్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. కానీ సునీతకు సీబీఐ ఎంతో స్వేచ్ఛ ఇచ్చింది, లెటర్ ఉన్న విషయం పోలీసులు నాకు చెప్పకపోవడం కేసులో ప్రధానమైన తప్పు అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి రిలీజ్ చేసిన వీడియోలో వివరించారు. సీబీఐ విచారణ తీరు ప్రజలకు తెలియాలని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.