టీడీపీ అడ్రస్ గల్లంతు చంచల్‌గూడ జైలుకు తరలించిన అధికారులు క్షమాపణలు చెప్పిన రజినీకాంత్

1.ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ కోటి 10లక్షల మిస్ట్ కాల్స్ వచ్చాయి..
ఏపీలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ప్రజలంతా జేజేలు పలుకుతున్నారని ఎమ్మెల్సీ రాజశేఖర్ రెడ్డి వెల్లడి.

2.ఏపీవ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ సీఐడీ సోదాలు…
డిపాజిట్ సొమ్మును వేర్వేరు సంస్థలకు మళ్లించడంపై సోదాలు ముమ్మరం.

3. వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచిన వ్యక్తి రజనీకాంత్..
తర్వాత ఎన్టీఆర్ను కలిసి తాను తప్పు చేశానని క్షమించమని అడిగారు అంటూ లక్ష్మీపార్వతి క్లారిటీ.

4.పవన్ కల్యాణ్ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి దించాడు..
చంద్రబాబు కుట్ర రాజకీయాల్ని పవన్ ఇకనైనా గ్రహించాలని ఎమ్మెల్యే కొడాలి నాని హితవు.

5.చంద్రబాబుతో అంటకాగితే టిడిపితో పాటు జనసేనకు అడ్రస్ కూడా గల్లంతుకావడం ఖాయ౦..
ఇప్పటికైనా పవన్ కళ్ళు తెరిచి బాబును వీడితే భవిష్యత్తు ఉంటుందని కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు.

6. పోలవరం ప్రాజెక్ట్ వ్యయం వ్యవహారంలో జోక్యం చేసుకోలేము..
అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం..

7.తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారు..
గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన వ్యక్తి సీఎంగా రాష్ట్రానికి అవసరమా అని నిమ్మల రామానాయుడు ప్రశ్న.

8.మే 3న భోగాపురం విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన..
తొలి దశలో 5 వేల కోట్ల పెట్టుబడి.

9.వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి రిమాండ్ పొడిగించిన కోర్టు..
దీంతో భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించిన అధికారులు.

10.రజనీ కాంత్ మీద ఉదయాన్నే ఊర కుక్కలు మాట్లాడుతున్నాయి..
రోజా నోటికి అద్దు అదుపులేకుండాపోతోందని, నోరేసుకుని పడమని సీఎం జగన్ వదిలేశారంటూ వంగలపూడి అనిత సెటైర్లు.