నిండు చంద్రుడు ఒక వైపు.. చుక్కలు ఒకవైపు.. మహేష్ బాబు టక్కరిదొంగ సినిమాలో ఈ పాట మీకు గుర్తు ఉండే ఉంటుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో కూడా ఓ టక్కరిదొంగ… నిండు చంద్రుడుని ఎదుర్కోలేక.. మిగిలిన అన్ని గ్రహాలను పోగేసుకొని.. పొత్తుల కోసం ఎగేసుకుంటున్నాడు.
ఆ టక్కరిదొంగ ఎవరో ఇప్పటికే మీకు అర్ధమయ్యే ఉండాలి. ఎస్.. మీరు అనుకుంటున్న అతనే. నాడు మామకు వెన్నుపోటు పొడిచి అన్యాయంగా పార్టీని లాక్కున్న ఆ టక్కరిదొంగే. ఆయన రాజకీయ జీవితం 45 ఏళ్లు. సిఎం జగన్ కి 50 ఏళ్లు.. అంటే ఆయన రాజకీయ అనుభవ0 జగన్ వయసంత. సిఎం జగన్ అంటే చంద్రబాబు ఎందుకు అంతలా గజగజా వణికిపోతున్నాడు..? జగన్ ను ఓడించడానికి చంద్రబాబుకు అంతా కష్టంగా ఎందుకు మారింది…? బాబు దిగులు ఎందుకోసం..? ఎవరికోసం..? అధికారంలోకి రావాలంటే బాబు త్యాగాలకు ఎందుకు సిద్దమయ్యారు..? పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టింది బాబు కోసమేనా..? పవన్ కళ్యాణ్ ని సిఎం హోదాలో చూడాలనుకుంటున్న జనసైనికుల ఆశలు మళ్ళీ ఆవిరి అవడం ఖాయమా..? తాజాగా చంద్రబాబు, పవన్ భేటీ అనంతరం ఇలాంటి ప్రశ్నలే అనేక రకాల చర్చలకు దారి తీశాయి. నా రాజకీయ అనుభవం 45 ఏళ్లు ఇలా చంద్రబాబు లెక్కలు చెప్పుకోవాల్సిందే కానీ.. యేళ్లు పెరుగుతున్నా సింగల్ గా గెలిచే సత్తా చంద్రబాబుకు లేదని చాలా క్లియర్ కట్ గా అర్ధంఅవుతుంది. టీడీపీలో సంచలనాలేవీ ఉండవు, ఉండబోవని అర్ధమవుతుంది. ఒకేఒక్కడు.. అంతమందిని గడగడలాడిస్తున్నారంటే సిఎం జగన్ కి ప్రజల్లో ఎంత నమ్మకం ఉందో అర్ధంఅవుతుంది. అయితే..టిడిపి – జనసేన పొత్తులకు లైన్ క్లియర్ అయినట్టే అని ఆ రెండు పార్టీ నేతల మాటలు వింటూంటేనే అర్ధమవుతుంది. కానీ ఇక్కడొచ్చిన చిక్కు ఏంటంటే.. పొత్తులకు బీజేపీ ఒకే చెప్పకపోవడమే. ఒంటరిగా అయినా పోటీ చేస్తాం కానీ టిడిపి తో పొత్తు పెట్టుకోమని బీజేపీ నేతలు ఇదివరకే తేల్చి చెప్పేశారు. ఇప్పుడు తాజాగా బాబు – పవన్ సమావేశంపై బీజేపీ అధిష్టానం గుర్రుగానే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీ బీజేపీ నాయకులు కూడా వీరి భేటీపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. చేయడానికి కూడా ఇష్టపడట్లేదు.
అయితే.. సిఎం జగన్ అవసరం మోడీకి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేల బలం, రాజ్యసభలో సభ్యులా బలం వైసీపీ మెందుగానే ఉంది. ప్రస్తుతం సిఎం జగన్ కూడా మోడీకే మద్దతు తెలుపుతున్నారు. ఇకపై కూడా సిఎం జగన్ అవసరం మోడీకి కావాలి కూడా. చంద్రబాబుతో పెట్టుకుంటే.. ఆయనిది రెండు నాలుకల ధోరణి.. బాబు అవసరం తీరిపోయిన తీరా ఎలా వ్యవహరిస్తారో.. ఎన్నెన్ని మాటలు అంటారో మోడీకి బాగానే తెలుసు. గతంలో మోడీని చంద్రబాబు ఎన్ని మాటలు అన్నారో కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు బాబుతో మళ్ళీ చేయి కలపాలి అంటే మోడీనే ఒక మెట్టు డిగాల్సి వస్తుంది. మరి ఆయన ఆ పని చేస్తారా అంటే అసలు ఛాన్స్ లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇక బీజేపీని కాదని టిడిపి -జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ పెద్దగా ఫలితం ఏమీ ఉండబోదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.