చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఏదో అభివృద్ది చేస్తున్నట్టుగా ఎన్నికల ముందు బిల్డప్ లు ఇవ్వడమే కానీ.. ఆయన చేసే అభివృద్ది అంతా తూతూ మంత్రంగానే ఉంటుందని మరోమారు ఋజువయ్యింది. నాడు చంద్రబాబు గాలికి వదిలేసిన భోగాపుర౦ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ కి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. కానీ చంద్రబాబు హయాంలో ఎలాంటి భూసేకరణ పనులు జరగలేదు. 2019 ఎన్నికలకు ముందు కేవలం శంకుస్థాపన చేసి.. అలా దానిని గాలికి వదిలేశారు. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి రాష్ట్రాన్ని అభివృద్ది పడంలో నడిపిస్తుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండేళ్లలోనే అందుబాటులోకి తేవాలనిలక్ష్యం నిర్దేశించుకుంది. ఏటా 1 కోటి 80 లక్షల మంది ప్రయాణించేలా దీన్ని నిర్మించనున్నారు. ఈ నెల 3వ తేదీన సిఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అటవీ, పర్యావరణ అనుమతులతో పాటు భూ సేకరణలో ఎదురైన అవాంతరాలను అధిగమించి 2,200 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించానున్నారు. ఇక ఇప్పటికే 2,195 ఎకరాల భూసేకరణ పూర్తయిందని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. విజయనగరం , విశాఖలో అనేక అభివృద్ది కార్యక్రమాలకు సిఎం జగన్ శంకుస్థాపనలు చేయనున్నారు. శంకుస్థాపన ఈ ఎయిర్ పోర్ట్ వల్ల ఉతరాంధ్రలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.