కేతిరెడ్డి ని టార్గెట్ చేస్తున్న పచ్చ మీడియా వరుస కథనాల వెనుక మిస్టరీ బాబు కరకట్ట వదిలి పరార్

కష్టం ఏదైనా క్షణాల్లో మంచి చేస్తే.. ఎల్లో మీడియాకి, పచ్చ బ్యాచ్ కి ఎందుకంత కడుపుమంట..? ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలను తీర్చడమే ఆయన చేసిన తప్పా..? బోడి గుండుకి మోకాలికి ముడివేసిన చందంగా ఆ నాయకుడు చేస్తున్న మంచిని అవినీతిగా మారుస్తారా..? గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కదం తొక్కుతూ.. పదం పాడుతూ.. తన నియోజకవర్గంలో వీధి వీధి తిరుగుతూ.. ఎండా వానా చూడకుండా.. ఆయన గెలిచిన నాటి నుండి నేటి వరకు.. అలుపెరగకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ.. తన పని తాను చేసుకుంటూ పోతుంటే.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని
పచ్చ మీడియా టార్గెట్ గా చేసుకొని లేనిపోని రాతలు రాస్తూ.. భోగస్ కథనాలు వల్లిస్తూ.. నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది.
అయినా.. కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలకల్నీ, పందికొక్కుల్నీ భరిస్తూ ప్రజల కోసం, తనను నమ్ముకున్న వారి భవిష్యత్ కోసం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి భూకబ్జాలు చస్తున్నారంటే ధర్మవరం ప్రజలెవ్వరూ నమ్మరు.
ఏంటి సిఎం కాన్వాయ్ ని రైతులు అడ్డుకున్నది ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కంప్లయింట్ చేయడానికా..? అసలు సిఎం ఆ రూటులో వెళ్తున్నారని అధికారులకే సరిగా తెలియదు. కానీ ఈ పచ్చమీడియాకి ఎలా తెలిసింది.. రైతులు అక్కడే అడ్డుకుంటారని పచ్చ మీడియాకి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇదంతా పక్కా ప్లాన్ అని కూడా ఆ మరుసటి రోజే.. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధారాలతో సహా వల్లడించారు కదా.. మళ్ళీ ఇప్పుడేందుకు ఈ ఏడుపులు. వల్లించిందే వల్లించి వాదిస్తూ.. అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ౦ బురదజల్లడం పచ్చ మీడియాయకే అలవాటేగా. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పాల్సింది అక్కడి జనం. ఎర్రగుట్టపై ఫామ్ హౌస్‌ కట్టుకుంటే అక్రమ౦గా కట్టుకున్నారని లోకజ్ఞానం తెలియని లోకేష్ కూడా అంటున్నారు. మరి మీరు కరకట్టపై కట్టిన ఫామ్ హౌస్‌ ఎలా వచ్చింది లోకేష్. అది అక్రమంగా కట్టుకున్నది కాదా..? లేక మీకు ముందునుంచే అక్కడ భూములు ఏమైనా ఉన్నాయా..? ఏదైనా ఆరోపణలు చేసే ముందు ఆధారాలు ఉంటే మాట్లాడాలి.. లేదంటే గమ్మున ఉండాలి. ఇలా నోటికొచ్చినట్టు నిరాధార ఆరోపణలు చేస్తే.. చివరికి జనాల్లో నవ్వులపాలవడమే.
ఏ ప్రజానాయకుడు చేయని విధంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి చేస్తుంటే.. అవినీతి అక్రమాలు అంటూ వరుస కథనాల వెనుక ఎవరున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పచ్చ మీడియాకి తెలిసిందల్లా ఒకటే.. లేని పోని కడతాలు రాసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడం. బాబు కోసం పచ్చ మీడియా ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు లోకేష్ లు మాత్రం పైకి లేచే పరిస్థితి అయితే కనబడట్లేదు.