ముద్రగడ, దాడిశెట్టి రాజాకు ఊరట కేసు కొట్టేసిన కోర్టు

గత ప్రభుత్వ హయాంలో.. సరిగ్గా అయిదేళ్ళ క్రితం జరిగిన తుని రైలు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ1 ముద్రగడ పద్మనాభం, ఏ2 ఆకుల రామకృష్ణ, ఏ3 మంత్రి దాడిశెట్టి రాజా సహా 41మంది నిందితులు విజయవాడ రైల్వే కోర్టు ఎదుట హాజరయ్యారు. మొత్తం 24 మంది సాక్ష్యులలో 20 మంది విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తి కావడంతో తుదితీర్పు వెల్లడించింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్ల పాటు ఎందుకు సాగతీశారని ప్రశ్నించింది. బాధ్యులైన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఈ సందర్భంగా న్యాయస్థానం ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ సరిగా చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం మొత్తం 69 మందిపై కేసులు బనాయించింది. కాపులే తుని రైలును దగ్ధం చేశారని చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టించారు. 2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీలలో చేర్చుతామని చెప్పి హామీ ఇచ్చి.. తీరా 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఆ హామీని అమలు చేయకుండా మోసం చేసిన నేపధ్యంలో ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున ఉద్యమించారు. 2016లో తునిలో కాపు గర్జన మహా సభని నిర్వహించారు. ఆ సందర్భంగా ఆందోళన కారులు రైల్వే ట్రాక్ వరకు వెళ్ళి రత్నాచల్ ఎక్స్ప్రెస్ ని దగ్ధం చేయడం జరిగింది. అయితే.. ఇందులో బయట వ్యక్తులు ఎవరో ఈ పనికి పూనుకున్నారని అప్పట్లోనే ముద్రగడ పద్మనాభం, కాపు నాయకులు వివరణ కూడా ఇచ్చారు. కానీ పగబట్టిన చంద్రబాబు ముద్రగడ పద్మనాభంను అన్యాయంగా కొట్టించి, చివరికి ఆయన కుటుంబాన్ని రోడ్డున పడేశారు. అలాగే అప్పటి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై కూడా కేసులు బనాయించారు. ఇక ఈ కసుకు సంబందించి నేడు విచారణ పూర్తి కావడంతో విజయవాడ రైల్వే కోర్టు తుదితీర్పు వెల్లడించింది.
తుది తీర్పు వెలువడింది.