పవన్ కళ్యాణ్ నోటితో మాట్లాడి.. నొసలతో వెక్కిరించే స్వభావం కలిగిన వ్యక్తా..? నమ్మించి మోసం చేయడంలో బాబు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆరి తేరారా..? పవన్ కళ్యాణ్ ను భావి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించాలనుకుందా..? పొత్తుల కొస౦ చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ ఎప్పుడో ఒప్పందం చేసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే.. ఈ మాటలు అన్నది కూడా బీజేపీ నేతలే. 2021లో జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి వెన్నుపోటు పొడిచారట. నాడు జరిగిన ఉప ఎన్నికల్లో జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి అయిన రత్నప్రభకి కేవలం 7 శాతం వట్లే పోలయ్యాయి. అయితే.. ఆ సమయ0లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా సరిగా నిర్వహించలేదు. నిజానికి పవన్ కళ్యాణ్ బాబుతో దోస్తీలో ఉన్నారని, అందుకే పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల విషయమై పెద్దగా ఆసక్తి చూపలేదని స్వయంగా బీజేపీ నేతలే అన్నారు. అవును, వాళ్లిద్దరూ ఒకటయ్యారంటూ అప్పట్లోనే కమలనాథులు మైండ్‌గేమ్ మొదలుపెట్టారు. అయితే.. గత కొద్ది నెలల క్రితం వైజాగ్ వచ్చిన మోడీ పవన్ కళ్యాణ్ తో సమావేశమై.. పొత్తుల విశయంలో కొన్ని కండీషన్స్ పెట్టారని, అందుకే పవన్ మొహం మాడిపోయిందని కూడా అప్పట్లో వాదనలు వినిపించాయి. ఇప్పడు మళ్ళీ తాజాగా ఢిల్లీ వెళ్ళిన పవన్ బాబును కూడా కలుపుకుపోదామన్న ప్రతిపాదనను బీజేపీ అధిష్టానం తిరస్కరించిదని కూడా ప్రచారం జోరందుకుంది. ఇలా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో అంటకాగాలని చూస్తున్నారని, బీజేపీతో పొత్తులో ఉన్నామని ఏదో పైకి మాత్రమే చెప్తున్నారని, కానీ లోపల కుట్ర కోణం దాగి ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో.. టిడిపితో పొత్తు పెట్టుకోవాలనుకున్న జనసేనతో మోడీ కటీఫ్ చెప్పే ఉద్దేశ్యంలో ఉన్నారని పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.