అడ్డంగా దొరికిపోయిన అనిత సోషల్ మీడియాలో మహానటి వైరల్

చెల్లికి పెళ్లి చేయాలి.. మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నట్లు ఉంది.. వంగలపూడి అనిత చేసిన పని. పబ్లిసిటీ కోసం టిడిపి ఆత్రం, ఆరాటం అంతా ఇంతా కాదు. తమ పార్టీలోకి భారీ చేరికలు అంటూ, జగన్ పాలక నచ్చక ప్రజలందరూ తమ పార్టీ వైపు క్యూ కడుతున్నారని తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే వంగలపూడి అనిత అడ్డంగా దొరికిపోయారు. ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవాల్లో భాగంగా పాయకరావుపేటలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు టిడిపిలో చేరారు. చేరడంలో తప్పు లేదండనుకోండి. వైసీపీ నుంచి చేరికల పేరుతో టీడీపీ నేతలకు కండువాలు కప్పి అనిత అడ్డంగా దొరికిపోయారు. ఇలా సొంత పార్టీ వారికే మళ్లీ మళ్లీ టీడీపీ కండువాలు కప్పడం ఏంటి మహానటి అనిత అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో వైయస్సార్‌ సీపీ నాయకులు ఆధారాలతో సహా అసలు నిజాలు బయటపెట్టారు. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇతని పేరు భాస్కర్ చౌదరి. ఇదే వ్యక్తి.. ఇటీవల చంద్రబాబు పుట్టినరోజున కొంతమంది తెలుగు తమ్ముళ్లతో కలసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చెల్లికి పెళ్లి చేయాలి.. మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నట్లు.. తమ్ముళ్లకే మళ్ళీ టిడిపి కండువాలు కప్పుతున్నారు. ఇంతకంటే కామెడీ ఇంకెక్కడా ఉండదు.
కండువా కప్పిన తర్వాత కూడా షేక్ హ్యాండ్ ఇవ్వమని కూడా ఆమెనే అడుక్కొంటోంది. మహానటి చేసిన ఈ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.