సీఎం జగన్ భారీ విజయం లైన్ క్లియర్ చేసిన ఢిల్లీ పెద్దలు షాక్ లో పవన్

పవన్ కళ్యాణ్ నిజంగానే వీకెండ్ పొలిటీషనా..? ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ ఉచ్చరిస్తున్నారా..? ఆయన కేవలం సినిమాలలో మాత్రమే హీరో.. రాజకీయాలలో జీరోనా..? వారాహితో రోడ్డుపైకి వస్తా.. నన్నెవడ్రా ఆపేది.. అంటూ బిల్డప్ లు ఇచ్చి.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు..? పవన్ కళ్యాణ్ ఎవరికి దత్తపుత్రుడు..? పవన్ కళ్యాణ్ కి సముద్రమంత అభిమాన గళం ఉంచుకొని ఇంకా ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు..? చంద్రబాబును కూడా కలుపుకొని పోవాలని ఢిల్లీ పెద్దలకు చెప్పిన పవన్ కి బీజేపీ అధిష్టాన౦ ఏమైనా షాక్ ఇచ్చిందా..? ఆఖరికి అభిమానుల చేతకూడా తిట్టించుకునే పరిస్థితి ఎందుకొచ్చింది..? చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత ప్రస్తుతం రాజకీయాలలో ఇలాంటి ప్రశ్నలే చర్చనీయాంశంగా మారాయి. అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.

బీజేపీ అధిష్టాన౦ టిడిపిని నమ్మకపోవడానికి చాలా పెద్ద రీజన్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే.. చంద్రబాబు జిత్తులమారి ఎత్తుగడలు ప్రధానికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో కూటమి అని చెప్పి.. కూటమితో ఎలాగొలా అధికారాన్ని దక్కించుకొని.. తీరా చివరకు బీజేపీపై తిరుగుబాటు మొదలు పెట్టి.. ఢిల్లీ పెద్దలను నానా మాటలు అన్న సంగతి బీజేపీ నాయకులు తమ మైండ్ లో ఇప్పటికీ గుర్తుంచుకున్నారని ఏపీ బిజేపి నాయకులు ఒకానొక సందర్బంలో బహిరంగంగానే అన్నారు. సో ప్రస్తుతం ఢిల్లీ పెద్దలు ఏపీ రాజకీయాలలో పెనుమార్పులకు రంగం సిద్దం చేసుకుంటున్నారని చర్చలు నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితులలోనూ బాబుతో చేయి కలపదని రాష్ట్ర ప్రజలు సైతం తమ అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబుని టార్గెట్ గా చేసుకొని ఏపీలో రాజకీయం నడిపించాలని ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ మాంచి ఫామ్ లో ఉంది. కానీ టిడిపి మాత్రం చాలా కష్టాల్లో మునిగి తేలుతోంది. వైసీపీతో మాత్రం బీజేపీ సన్నిహితంగానే ఉంటుంది. సో.. ఏపీలో టిడిపి ని దెబ్బకొట్టి.. బీజేపీ ఎదగాలని ప్లాన్ వేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ పవన్ మాత్రం బాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీతో కటీఫ్ చెప్పడానికి వెనకాడరని కూడా చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ టిడిపి-జనసేన పొత్తులు వెట్టుకున్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అదే గనుక జరిగితే.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలే అవకాశం ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒడినట్టే లెక్క.
పొత్తులతో వస్తే.. టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉండొచ్చేమో గానీ.. విడివిడిగా వస్తే.. మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుంది. పొత్తుల కోసం అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో పవన్ నలిగిపోతున్నారు. మరి బీజేపీ మాట కాదని పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు పెట్టుకుంటే.. ఆపై జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా అంటున్నారు.