నెల్లూరులో బాబుకు భారీ షాక్ కొంపముంచిన టీడీపీ నేత

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎంత ఘాటుగా ఉంటాయో.. ప్రస్తుతం అక్కడ రాజకీయాలు అంతకంటే ఘాటెక్కాయి. జగన్ కి తన రాజకీయ అనుభవమంత వయసు లేదు ఎం చేస్తాడులే అని ధీమాతో ఉన్న చంద్రబాబు.. చివరికి సిఎం జగన్ కొట్టిన దెబ్బకి బాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక అసలు విషయానికొస్తే.. ఏపీలో ఈ మధ్య నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్గా మాయాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు పార్టీపై తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గ్గిరిదర్ రెడ్డి టిడిపిలోకి జంప్ అయ్యారు. త్వరలో కోటం రెడ్డి కూడా టిడిపి కండువా కప్పుకొనున్నారని ప్రచారం సాగింది. ఇక నెల్లూరులో వైసీపీ పట్టు కోల్పోయింది. ఈసారి ఎన్నికల్లో నెల్లూరులో టిడిపి జెండా ఎగరడం ఖాయం అనుకున్నారు. ఇంతలో టిడిపి కి బిగ్ షాక్ తగిలింది. ఆత్మకూరు టీడీపీ నేత, మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి త్వరలోనే వైసీపీ కండువా కప్పేందుకు సిద్ధం అవుతున్నారని ప్రచారం సాగుతోంది. బొమ్మారెడ్డి కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బొమ్మారెడ్డితో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారని లోకల్ టాక్. గతంలో బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వైసీపీలోనే ఉన్నారు. వెంకటగిరి టికెట్ రాకపోవడంతో.. ఆ పార్టీకి గుడ్బై చెప్పి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆత్మకూరు టికెట్ ఆశించారు బొమ్మిరెడ్డి.. పార్టీ నుంచి టికెట్పై ఎలాంటి హామీ లభించక పోవడంతో.. మరోసారి వైసీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా క్లీన్ స్వీప్ చేసేందుకు వైసీపీ వ్యూహాలకు పదును పెడుతుంది. ఇక టిడిపిలో ఉన్న అసంతృప్తి నాయకులను తమ వైపు తిప్పుకొని నెల్లూరు జిల్లాలో తమ సత్తా చాటేందుకు వైసీపీ ప్లాన్ రెడీ చేస్తోంది.