1.హోంశాఖపై సిఎం జగన్ సమీక్ష..
సోషల్ మీడియా వేధింపులపై ప్రత్యేక విభాగం.. మరోసారి దిశా యాప్‌పై డ్రైవ్.
2. విభజన చట్టంలోనే భోగాపురం ఎయిర్ పోర్టు గురించి ఉంది. ఆ నిజాన్ని రామోజీరావు ఎందుకు చెప్పటం లేదు?
నిన్న జరిగిన శంకుస్థాపన పండుగని చూసి జనం సంతోష పడుతుంటే రామోజీ పిచ్చి రాతలు రాస్తున్నారని మంత్రి బొత్స ఫైర్.
3.వివేకా హత్యకు ముందు, తర్వాత… ఫోన్ కాల్స్ వివరాలు కోర్టుకు ఇచ్చిన సీబీఐ
సునీల్ యాదవ్ – దస్తగిరి మధ్య అత్యధిక కాల్స్
4.జగన్ మళ్లీ సీఎం కావడం కోసమే రాజ శ్యామల యాగం చేస్తున్నారు..
రాష్ట్రాన్ని దోచుకు తినడానికి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఆయనకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించిన బొండా ఉమ.
5.ఏపీలో 70 శాతం ప్రజలు నన్ను సీఎంగా కోరుకుంటున్నారు..
చంద్రబాబు వస్తే ఏపీని మింగేస్తాడని బీజేపీ పెద్దలకు చెప్పానని వెల్లడి౦ చానన్న కేఏ పాల్.
6.రాజకీయాల్లోకి వస్తున్నాననే ప్రచారం వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు..
తనను తొక్కేద్దామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చికోటి ప్రవీణ్ ఆవేదన
7.ఈ నాలుగేళ్లలో ఎప్పుడైనా జగన్ పొలంలో దిగారా?.. ఒక చేతకాని దద్దమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ..
ఏలూరు జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు చంద్రబాబు పరామర్శ.
8.రుషికొండకు బోడిగుండు తప్ప.. ఉత్తరాంధ్రకు ఏం అభివృద్ధి చేశారు?..
శంకుస్థాపన చేసిన వాటికే నిన్న సీఎం శంకుస్థాపనలు చేశారని గంటా శ్రీనివాసరావు విమర్శ
9.గుంటూరులో అగ్రహారం పేరును తీసేసి.. రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటి..?
హిందువుల మనోభావాలను దెబ్బ తీయాలని వైసీపీ పనిగా పెట్టుకుందని సోము వీర్రాజు ఫైర్.
10.మా అమ్మను అసెంబ్లీ సాక్షిగా అవమానించారు..
ఫ్యాన్ ఆపేస్తే మహిళలకు మంచి రోజులు వస్తాయని పాణ్యం నియోజవర్గంలో లోకేష్ ఆగ్రహం.