ఏపీలో సిఎం జగన్ ను చంద్రబాబు ఎదుర్కోలేకపోతున్నారా.. ? ఒంటరిగా పోటీ చేయలేక పొత్తుల వైపు చస్తున్నారా..? జగన్ కొట్టిన దెబ్బ చంద్రబాబు నషాలానికి తాకిందా..? పొత్తులతో అధికారంలోకి రావడానికి బాబు మోడీ జపం చేస్తున్నారా..? పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేసినా బాబుకు ఉపయోగం లేదా..? జగన్ ను ఢీ కొట్టాలంటే బీజేపీ అండ అవసరమా..? గతాన్ని మోడీ అంత తేలికగా మరిచిపోయి బాబుతో పొత్తుకు సిద్దం అవుతారా..? పస్తుతం ఏపీ రాజకీయాలలో ఇవే ప్రశ్నలు సముద్రంలో ఉప్పెనలా ఉప్పొంగుతున్నాయి. అవును.. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే.. జగన్ ను ఢీ కొట్టడం బాబు వల్ల కాదని అంటున్నారు. గతంలో 151 సీట్లను కైవసం చేసుకొని హిస్టరీ సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ హిస్టరీని బద్దలు కొట్టాలని సిఎం జగన్ బరాబర్ చెప్తున్నారు. సిఎం జగన్ నోట వచ్చిన వై నాట్ మాట విన్న ప్రతిసారీ చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతుందనే చెప్పాలి. అందుకే నాడు మోడీని తిట్టి.. నేడు అదే మోడీని పొగడ్తలతో ముంచెత్తటం బట్టి చూస్తుంటేనే అర్ధమవుతుంది జగన్ ను ఢీ కొట్టలేక మళ్ళీ పొత్తులకు రంగం సిద్దం చేసుకుంటున్నారని. ఇదిలా ఉంటే.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీ స్కామ్ లో అడ్డంగా ఇరుక్కున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన అవినీతి ఆక్రమాల కేసులో స్టే లు తెచ్చుకోవడంతోనే పాలన సాగించారు అన్నట్లుగా ఉంది వ్యవహారం. తాను, తన బృందం ఎలాంటి తప్పు చేయకపోతే కోర్టుల నుంచి స్టే లు తెచ్చుకోవడం ఎందుకు.. ధైర్యంగా విచారణలు ఎదుర్కోవచ్చుగా. ఏదో తప్పు చేశారు కాబట్టి, దొరికిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అధికారం అండతో బాబు స్టేలు తెచ్చుకొని పబ్బం గడిపారు. ఇకపై మీ పప్పులు ఉడకవు. జగన్ సర్కార్ మీ బారతం పట్టేందుకు రంగంలోకి దిగారు. హయాంలో చోటు చేసుకున్న అవినీతి బాగోతాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. ఇక ఈ దర్యాప్తులో ఆధారాలు బయటపడితే.. బాబుతో సహా ఆయన బృందం కటకటాల వెనుకకు వెళ్ళడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబుకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.