బాబుకు కరెంట్ షాక్ నోరు అదుపులో పెట్టుకో మొహాన ఉమ్మేసిన రైతులు

అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా-ప్రభుత్వానికి ఇదే డెడ్ లైన్ అని ఎందుకు బాబు ఈ వయసులో అతిగా నోరు పారేసుకుంటున్నావ్. వడ్డీతో సహా చెల్లిస్తా అంటున్నావ్ అధికారమలో ఉన్నప్పుడు ఎంత నొక్కేశావ్ చెప్పు బాబు. నీ ఆవేదన నిజంగా రైతులకు అన్యాయం జరుగుతుందనా లేక.. నీకు ఆధికారం దక్కలేదనా..? నాడు నువ్వు వ్యవసాయం దండగ అనలేదా..? తమ హక్కుల కోసం పోరాటం చేస్తే.. రైతులపై దాడి చేయించింది ఎవరు బాబు..? కరెంటు బిల్లుల షాకులిస్తూ నాడు అధికారంలో ఉన్నప్పుడు రైతులను కాల్చుకుతినింది ఎవరు బాబు..? ఈ దురాగతం ఏంటని ప్రశ్నించిన రైతులను కొట్టించి జైల్లో పెట్టించింది ఎవరు బాబు..? హైటెక్‌ పాలన అంటూ రైతులకు నరకయాతన చూపించింది ఎవరు బాబు..? అసలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వరుణ దేవుడు కనికరించాడా చెప్పు బాబు..? వరుస కరువులు రావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంతమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారో తమరికి లెక్కలు తెలుసా బాబు..? రైతుల కోసం ఒక్క సంక్షేమ పథకాన్ని అయిన ప్రకటించావా బాబు..? ఇన్ని చేసిన నువ్వు ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తా అని అనడానికి నోరెలా వచ్చింది బాబు..? రైతులు శంతోషంగా ఉన్నారంటే అది వైఎస్ఆర్ ఫ్యామిలీ వల్లనే. రైతుల మొహంలో చిరునవ్వులు పూశాయంటే అది వైఎస్ఆర్ ఫ్యామిలీ మేలే అని చెప్పాలి. 2004లో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే 1,295 కోట్లు కరెంటు బిల్లులన్నీ మాఫీ చేసి మానవత్వం చాటుకున్నారు. మీకు అండగా నేనున్నా… అంటూ రైతుల్లో భరోసా నింపిన గొప్ప వ్యక్తి వైఎస్ఆర్. తండ్రి ఆశయసాధనలో నడుస్తూ.. రైతు భరోసా కేంద్రాలు స్థాపించి.. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే చర్యలు తీసుకుంటుంటే.. తమరు చేసే ఈ బురద రాజకీయం ఏంటి బాబు..? జగన్ ప్రభుత్వంలో తాము సంతోషంగా ఉన్నామని రైతులు చెప్తుంటే.. నీ ఏడుపు ఏంటి బాబు..? ఈ రైతు ప్రశ్నలకు చెప్పు జవాబు.