టిడిపికి షాక్… చంద్రబాబు పేలాలు ఏరుకోవడమే పవన్ కి మిగిలింది కేఏ పాల్ జెండానే

1. నేడు ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల..
ఈ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్న మంత్రి బొత్స.

2.ప్రతిపక్షనేతగా ఓదార్పునిస్తున్నావా..పేలాలు ఏరుకుంటున్నావా చంద్రబాబూ..
రైతులకు ఇబ్బంది వస్తే ఒక షో నిర్వహించాలని బయలుదేరాడు అంటూ మంత్రి చెల్లుబోయిన సెటైర్లు.

3.వైఎస్సార్ మరణం తర్వాత పార్టీని అంటిపెట్టుకొని ఉన్నానని అయినా తనపైన నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు..
రాజకీయంగా తనను హింసించడమే ధ్యేయంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయంటూ కన్నీరు పెట్టిన బాలినేని.

4.కృష్ణా నదీజలాల్లో వాటాల పంపకాలపై ఈ నెల 10న సమావేశం ఎజెండా ఖరారు..
ఏపీ – తెలంగాణకు ఏభై శాతం చొప్పున నీటిపంపిణీ చేయాలన్న అంశాన్ని ఎజెండాలో చేర్చిన అధికారులు.

5.జగన్ ​​​​​​​ప్రభుత్వానికి ఇదే డెడ్ లైన్..
తాను పర్యటన పెట్టుకున్న తర్వాతే అధికారుల్లో చలనం వచ్చిందని చంద్రబాబు వెల్లడి.

6.కంత్రీ జగన్ తన జీవితంలో సొంతగా ఏ ప్రాజెక్టు, కంపెనీ తీసుకురాలేడు…
ఆఖరికి పార్టీ కూడా ఆయనది కాదు. వేరే వాళ్ళు పెట్టిన పార్టీకి ఈయన మళ్లీ రిబ్బన్ కట్ చేశాడు అంటూ లోకేష్ సెటైర్లు.

7.విశాఖ స్టీల్ ప్లాంట్కు నష్టాల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర..
గత ఏడాది 913 కోట్ల రూపాయల లాభాలు వస్తే.. 2022-23లో 3049 కోట్లు నష్టం రావడం ఏంటని ప్రశ్నించిన సీపీఐ రామకృష్ణ.

8.ఎవరైనా అధికారం కోసం పార్టీ పెడతారు. కానీ, పవన్ మరొకరి జెండా మోయడానికే పార్టీ పెట్టారు…
ఇక, మిగిలింది కేఏ పాల్ జెండానే అంటూ పవన్ ను ఎద్దేవా చేసిన మంత్రి రోజా.

9. వైద్య రంగం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు..
ఎక్కడా ఆరోగ్యశ్రీకి డబ్బులు వసూళ్లు చేయడం లేదని మంత్రి విడదల రజినీ స్పష్టం

10.టిడిపికి షాక్… సీఎం సమక్షంలో వైసిపిలోకి నెల్లూరు సీనియర్ నేత..
నెల్లూరు మాజీ జడ్పిటిసి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్