1.ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ..
పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు.పైచేయి సాధించిన బాలికలు.
2. ఏపీలో 50 మంది డీఎస్పీలు బదిలీ..
ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ.
3. 38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వ౦..
ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం ఉండాలనేది సీఎం జగన్ ఉద్దేశం అంటూ మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్య.
4.చంద్రబాబుకు జ్ఞాపకశక్తి తగ్గిపోయింది..
ప్రతి రైతులకు బీమా ద్వారా రక్షణ కల్పిస్తున్నామని మంత్రి కాకాణి క్లారిటీ.
5.అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి..?
చంద్రబాబు తనవారికే ప్రయోజనం చేకూర్చాలని చూస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ ఫైర్.
6.స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసుల్లో అరెస్ట్ చేస్తారనే భయంతోనే చంద్రబాబు జనంలో తిరుగుతున్నారు..
ఏం చేసినా జైలుకెళ్లడం ఖాయం అంటూ బాబుపై మంత్రి కారుమూరి విమర్శలు.
7. ఒంగోలు డీఎస్పీ నియామకంలో పంతం నెగ్గించుకున్న బాలినేని..
ఆయన సూచించిన దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డికి పోస్టింగ్
8.జగన్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసింది…
సంచులు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని .. ఇందులో అవినీతి జరుగుతోందని సోము వీర్రాజు ఆరోపణ.
9.ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లుపక్కా..
టీడీపీ- జనసేన కలవకపోయినా చంద్రబాబు 100 సీట్లతో గెలుస్తారని గోనె ప్రకాశ్ రావు జోస్యం.
10.ఉమ్మడి అనంత జిల్లా జెడ్పీ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది.
15 ఆర్థిక సంఘం నిధులు ఏమయ్యాయంటూ పార్టీ జెడ్పీటీసీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన.