కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి లోకేష్ మద్దతు కొడాలి నానితో చంద్రబాబు సెల్ఫీ జగన్ కి జై కొట్టిన ఉండవల్లి

1.మణిపూర్లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల విషయంలో ఫలించిన సీఎం జగన్ ప్రయత్నాలు..
వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు.

2. రైతు సమస్యలపై బాబుకు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి లేదు..
వారిద్దరూ ఒకే పాట పదే పదే పాడుతున్నారని మంత్రి అంబటి ఎద్దేవా.

3.అమెరికా టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువతి ఐశ్వర్య మరణించడంపై ఏపీ ప్రభుత్వం ఆందోళన..
తాటికొండ ఐశ్వర్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపిన నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పండుగాయల రత్నాకర్.

4.మార్గదర్శి కేసుతోనైనా దేశంలో ఆర్థిక నేరాలకు ఫుల్స్టాప్ పడాలి..
సీఎం జగన్ వేసిన ఎస్ఎల్పీ పిటిషన్తోతో డిపాజిట్ దారులకు కొత్త ఊపిరి వచ్చింద ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్య.

5. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ..
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ టీడీపీ తీర్థం.

6.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం..
తమది జగన్ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ కాదని నారా లోకేశ్ వ్యాఖ్య.

7.చంద్రబాబు అంటే గౌరవం.. ఆయనకూ నేనంటే అభిమానం..
2019లో చంద్రబాబు తనను పార్టీలోకి ఆహ్వానించారని, అయితే రాబోనని తేల్చి చెప్పానని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వెల్లడి.

8.గత ప్రభుత్వంలో చంద్రబాబు శంకుస్థాపనలు చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు…
చంద్రబాబు ఎక్కడో సెల్ఫీ దిగడం కాదు.. గుడివాడలో టిడ్కో ఇళ్ల దగ్గర కొడాలి నానితో సెల్ఫీ దిగే దమ్ముందా అంటూ మంత్రి రోజా సవాల్.

9.జనసేన అధికారంలోకి వస్తే ఏపీకి స్వర్ణయుగం మొదలవుతుంది..
ఏపీ భవిష్యత్తు జనసేన గెలుపుతోనే ముడిపడి ఉందని నాగబాబు జోష్యం.

10. లోకేశ్.. నీ టెంటు దగ్గరకొస్తా.. నాపై ఆరోపణలు రుజువు చేశాకే కర్నూలు దాటాలి ..
అలా కాకపోతే ఈరోజు సాయంత్రం‌లోపల ఎక్కడో ఒకచోట నేను పాదయాత్ర‌లోకి వస్తా అని కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఛాలెంజ్.