ఏపీలో ఎన్నికల హీటు మరింత రాజుకుంటుంది. ఎవరి స్టైల్ లో వారు పొలిటికల్ స్టంట్ లు మొదలెట్టేశారు. ఎత్తులకు పై ఎత్తులు.. వ్యూహ ప్రతివ్యూహాలలో రాజకీయ నాయకులు బిజీ బిజీ గా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరిది విజయం అంటూ ఇప్పటి నుంచే అందరిలో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. మరి ముఖ్యంగా పొలిటికల్ పొత్తులపై మరింత చర్చలు నడుస్తున్నాయి. అసలు పొత్తులు ఉంటాయా.. ఉండవా..? ఉంటే వైసీపీకి రిస్క్ ఎంత వరకు..? బీజేపీ పోతులకు ఒకే అంటుందా.. సైడ్ అవుతుందా..? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు ఏపీ రాజకీయాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ గా మారాయి. జనసేన అధికారంలోకి వస్తే ఏపీకి స్వర్ణయుగం మొదలవుతుందట. ఏపీ భవిష్యత్తు జనసేన గెలుపుతోనే ముడిపడి ఉందట. యువతకు బంగారు భవిష్యత్తు లభిస్తుందట. నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. పొత్తు ఉందా? లేదా? ఒక్కరే పోటీ చేస్తారా? అవన్నీ మనకెందుకు. పవన్ కల్యాణ్ ఎన్ని సీట్లలో అభ్యర్థులను నిలుపుతారో అన్నింటిలో గెలిపించాలి. అది మన కార్యకర్తల డ్యూటీ. విశ్లేషణ వద్దు. ఓటు మనది, వ్యూహం పవన్ ది. మనందరికీ నచ్చిన విధంగానే పవన్ నిర్ణయం ఉంటుందని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై కొందరు జనసైనికులు నాగబాబుని ప్రశ్నిస్తున్నారు. అసలు పవన్ కి ఒక వ్యూహం అంటూ ఉందా..? అసలు గట్టిగా 20 స్థానాలలో అభ్యర్ధులను నిలిపే దమ్ము పవన్ కి ఉందా అంటూ సోషల్ మీడియాలో నాగబాబుపై ఓ రేంజ్ లో విసుర్లు విసురుతున్నారు. రాజకీయాలలో విహం అంటే ఏంటో అర్ధం కూడా తెలియని పవన్.. ఎవరిదో పల్లకి మోయడానికి పార్టీ పెట్టారని నాగబాబు వ్యాఖ్యలకు సెటైర్లు వేస్తున్నారు. నిజమైన నాయకుడు అంటే ఎవ్వరితో పొత్తులతో కాకుండా.. ఒంటరిగా బరిలోకి దిగాలని సొంత అభిమానులే అంటున్నారు. కానీ పవన్ మాత్రం పొత్తులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తమ అభిమానులకు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చోట కూడా ఎమ్మెల్యే గా గెలవలేని పవన్ కళ్యాణ్ ఏకంగా సిఎం అవుతాడని నాగబాబు చెప్పడం చాలా హాస్యంగా ఉందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.