గన్నవరంలో బాబుకి భారీ షాక్ తెరపైకి 5గురు తమ్ముళ్ళు దుకాణం సర్దేసిన జనసేన

ఏపీలో ఉన్న కొన్ని హాట్ సీట్లలో గన్నవరం నియోజకవర్గం ఒకటి. అప్పుడొక లెక్క, ఇప్పుడొక లెక్క అన్న మాదిరిగా ఉన్నాయి ఇక్కడి రాజకీయాలు.
గన్నవరం నియోజకవర్గం టిడిపికి కంచుకోట. ఈ నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు టిడిపి అభ్యర్ధి విజయం సాధించారు. వల్లభనేని వంశీ రెండుసార్లు విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి బొమ్మపై గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీ పంచన చేరారు. అయితే.. ప్రస్తుతం గన్నవరం పాలిటిక్స్.. గరం మీదున్నాయి. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీని ఓడించాలని టిడిపి ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. కానీ వంశీని ఎదురించి ఢీ కొట్టే సరైన అభ్యర్ధి ఎవరో అన్నది ఇంకా చంద్రబాబుకి పాలుపోవడం లేదు. గన్నవరం టీడీపీలో.. వంశీపై పోటీకి కొత్త ముఖాలు తెరమీదికొస్తున్నాయి. అదే జరిగితే.. ఈసారి కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగానే పోరు ఉండబోతుందా? రాబోయే ఎన్నికల్లో.. గన్నవరంలో కనిపించే సీనేంటి? ఆఖరికి పట్టాభి కూడా గన్నవరం నుంచి పోటీ చేస్తానని సవాల్ చేశారు. మొన్నటిదాకా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు టీడీపీ ఇంచార్జ్‌గా ఉండేవారు. ఆయన మరణానంతరం.. పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ కన్వీనర్‌గా.. సీనియర్ నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే గన్నవరంలో.. ఇప్పుడు ఆ వర్గం నేతలంతా.. సైలెంట్ అయిపోయారు. రోడ్లపై వచ్చిన పోరాటాలు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఆర్థికంగా బలంగా ఉన్న వంశీని తట్టుకోవడం సాధ్యం కాదని.. తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే.. గత ఎన్నికల్లో వంశీకి ప్రత్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వైపే.. టీడీపీ చూస్తోంది. ఆయన గనక ఓకే అంటే.. గన్నవరంలో టీడీపీకి ఎదురులేదనే భావనలో పసుపు పార్టీ నేతలున్నారు. ఈ విషయంలో.. యార్లగడ్డ ఇంకా ఎటూ తేల్చుకోలేదనే టాక్ వినిపిస్తోంది.
విజయవాడ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్‌ ను.. గన్నవరం నుంచి బరిలోకి దించుతారని.. టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
అదేవిధంగా గన్నవరంలో పోటీ చేయబోయేది తానేనని.. టీడీపీ నేతల పట్టాభి సీనియర్ నేతల దగ్గర ప్రస్తావిస్తున్నారట. మరోవైపు.. స్థానిక పారిశ్రామికవేత్త వాసిరెడ్డి మనోజ్ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారట. మొత్తంగా గన్నవరం సీటుని ఆశిస్తున్నవారిలో 5గురు ఉన్నారట. ఇలా పార్టీలో ఉన్న నాయకులు ఎవరికి వారు.. ప్రచారం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని ఎమ్మెల్యే వంశీ భావిస్తున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన నేత.. వల్లభనేని వంశీనే.నియోజకవర్గంలో ఆయనకు సొంత ఇమేజ్‌‌తో పాటు వైసీపీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్లస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. పైగా.. ఇప్పటికీ టీడీపీ నుంచి ఎవరు పోటీలో ఉంటారనే దానిపై.. క్లారిటీ లేకపోవడం కూడా వంశీకే మేలు చేస్తాయనే చర్చ జరుగుతోంది. ఇక టిడిపి , జనసేన పొత్తులు ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండదని టాక్ వినిపిస్తోంది.