ఓటు మనది.. వ్యూహం పవన్ ది అని తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు పలు రకాల చర్చలకు దారి తీశాయి. ఇక ఈ నేపధ్యంలోనే ప్రచారం తెగ వైరల్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన పొత్తులు ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అదే గనుక జరిగితే.. నాగబాబు ఎన్నికల భరిలో నుంచి డ్రాప్ అవుతారని ప్రచారం సాగుతోంది. ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యకర్తల మీటింగులో పవన్ అన్యాపదేశంగా నాగబాబు ప్రస్తావన తెచ్చి నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని పార్టీ వ్యవహారాలను నాగబాబు చూసుకుంటారని క్యాడర్ కి చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.
ఇక పవన్ అసెంబ్లీకి పోటీ చేస్తే నాగబాబు పార్లమెంట్ కి చేస్తారు అని కూడా అంతా అనుకున్నారు. అయితే లేటెస్ట్ గా నాగబాబు జనసేన క్యాడర్ తో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. జనసేనను గెలిపించడం కోసం తాను అంతటా పర్యటిస్తాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో నర్సాపురం సీటు మీద మోజు పెంచుకున్న రఘురామ క్రిష్ణం రాజు వరసగా రెండవసారి ఎంపీ సీటుకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే నర్సాపురం లోక్ సభ సీట్ లో ఒకే ఒక్కడు వరసగా మూడు సార్లు గెలిచారు. ఆయనే భూపతి రాజు విజయ్ కుమార్ రాజు. తెలుగుదేశం తరఫున ఆయన 1984 నుంచి 1996 వరకూ పన్నెండేళ్ల పాటు మూడు సార్లు ఎంపీగా పనిచేశారు. అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ ఒకసారి గెలిచిన వారు మరోసారి గెలిచిన దాఖలాలు అయితే లేవు.మరి నాలుగున్నరేళ్ల పాటు నర్సాపురం ముఖం చూడని రెబెల్ ఎంపీ రఘురామ జనసేన టికెట్ తెచ్చుకుని టీడీపీ పొత్తుతో రెండవసారి గెలుస్తారా అన్నదే కీలకమైన పాయింట్. అలా గెలిచినట్లు అయితే మాత్రం ఆయన విజయ్ కుమార్ తరువాత ప్లేస్ లోకి వచ్చినట్లే. మరి చూడాలి. వచ్చే ఎన్నికల్లో నాగబాబు, రఘురామ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అనేది.