పవన్ కళ్యాణ్ ను షేక్ చేస్తున్న ట్రోల్స్ అసలు ఎవరీ.. * ?

ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎవరు? ఆయన ఒక రాజకీయ నాయకూడా..? లేక సినీ హీరోనా..? అన్యాయాన్ని ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి.. ఆయన చేసే వన్ సైడ్ రాజకీయాలు దేనికోసం..? అసలు ఆయన౦తట ఆయనే పార్టీ పెట్టారా.. లేక ఆయన చేత ఎవరైనా పార్టీ పెట్టించారా..? ప్యాకేజీ కోసమే ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చారా..? పవన్ కళ్యాణ్ వీకెండ్ పొలిటీషియన్ అనడం కరెక్టేనా..? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇవి మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ చేసే రాజకీయాలపై ఎన్నో రకాల విమర్శలు, ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. 2014లో టీడీపికి సపోర్ట్ చేశారు. ఆ తరువాత 2019లో ఏం చేశారో చూశాం. పోనీ ఈ ఎన్నికల్లో అయినా సింగల్ గా పోటీ చేసి జనసైనికుల ఆశను నెరవేరుస్తారా అంటే.. లేదనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పొత్తులతోనే భరిలోకి దిగనున్నారని అల్మోస్ట్ తేలిపోయింది. ఇక వారాహి విషయానికొస్తే. ఆయన ప్రచార రథం రోడ్డు మీదకు రాకముందే పెద్ద వివాదంలో పడింది. వారాహి మీద తిరుగుతూ.. ఎన్నికల ప్రచారంచేస్తానని తెగ ఊగిపోయారు. చేతనైతే వైఎస్సార్‌సీపీ తన యాత్రను ఆపాలని అధికార పార్టీకి సవాలు విసిరారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించి వందరోజులు గడుస్తున్నప్పటికీ.. కానీ ఆ యాత్ర ఇప్పటికీ మొదలే కాలేదు. ఆయన చేతులతో ఆయనే యాత్రను ఆపుకున్నారని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటన వేళ పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్..తెగ షేక్ చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ.. ఆయనకు కాళీ సమయాల్లో ఇలా రోడ్లపైకి వచ్చి జనసైనికులకు దర్శనమివ్వడం తప్ప పవన్ కళ్యాణ్ వల్ల ఒరిగేది ఏమీ లేదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ కానీ.. జనసేన సిద్దాంతాలు కానీ ఏ ఒక్కటీ కోరెక్ట్ గా లేవని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. రైతులను పరామర్శించడం కోసం వస్తున్నారా లేక.. ప్యాకేజీ తీసుకొని రాజకీయాలు చేయడానికి వస్తున్నారా అంటూ.. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఎన్నికలు దగ్గరకొస్తున్నా కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా షూటింగ్ లలో బిజీ బిజీ గా ఉన్నారు. అసలు రాజకీయాలపై కనీసం శ్రద్ద కూడా పెట్టట్లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. మరి ఇంకానైనా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తారో లేక.. వైసీపీ అంటోన్న విధంగా వీకెండ్ పొలిటీషన్ గా ఉంటూ.. ఉన్న పరువును, రాజకీయ భవిష్యత్ ను పోగొట్టుకుంటారో అనేది ఆయన చేతుల్లోనే ఉంది.