ఏపీ సీఎంకి మోదీ అండ సేవకుడిగా మారిన జగన్ టెలిఫోన్ జంక్షన్ బాక్సులు జామ్

1. ప్రజల్లో గుర్తింపు కోసమే చంద్రబాబు రైతు యాత్ర చేస్తున్నారు…
ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేస్తున్నామని మంత్రి బొత్స సత్యానారాయణ స్పష్టం.

2.ప్రజలకు సేవ చేసేందుకే సేవకుడిగా వచ్చాను..
సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ వెల్లడి.

3.ప్రతి ఒక్కరికీ కూడు, గూడు కల్పించడమే సీఎం జగనన్న అజెండా..
గడపగడపకు మహాపాదయాత్రలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి వ్యాఖ్య.

4.ఏపీలో అడుగడుగునా మోదీకి సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారు..
బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని సీపీఐ నారాయణ విమర్శలు.

5.రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన..
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న పవన్ .

6.జగనన్నకు చెప్పుకోవడం, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం ఒకటే..
ఆయనే అసలు సమస్య అని బీజేపీ నేత సత్యకుమార్ విమర్శ.

7.వందల టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టినప్పటికీ ప్రజా సమస్యలతో టెలిఫోన్ జంక్షన్ బాక్సులు జామ్ కావాల్సిందే..
జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై గంటా శ్రీనివాసరావు కామెంట్స్.

8.వివేకా కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి..
విచారణను వాయిదా వేసిన సీబీఐ కోర్టు

9.ఇడుపుల పాయలో సొరంగాలు తవ్వి అక్రమ సొమ్ము దాచి పెడుతున్నారు..
తమ బాధలు చెప్పుకోవటానికి వెళితే మంత్రులు రైతులను అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ అచ్చెన్నాయుడు ఫైర్.

10. 4 ఏళ్లలో జగన్ డ్వాక్రామహిళలకు చేసింది శూన్య౦..
టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆరోపణ.