టీడీపీ చీప్ ట్రిక్స్ బట్టబయలు జగన్ చేసిన పనికి పిచ్చెక్కి ××× ఎర్రగడ్డలో బెడ్స్ రెడీ చేయాల్సిందే.

చీప్ ట్రిక్స్ ప్రదర్శించడం, కట్టు కధలు అల్లడం, అధికార పార్టీపై బురద జల్లటం.. టీడీపీ కి కొత్తేమీ కాదనుకోండి. జగన్ ప్రభుత్వం ఏది చేసినా వారి మీద పడి ఏడవడమే పనిగా పెట్టుకుంటారు. అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్న సామెతలా.. ఉంది టీడీపీ నేతల తీరు. ఇంతకీ ఇప్పుడు ఏం జరిగింది అనే కదా మీ ప్రశ్న. జగనన్నకు చేబుదాం కార్యక్రమంపై కూడా టీడీపీ చీప్ ట్రిక్స్ ప్రదర్శించి నలుగురిలో నవ్వుల పాలయ్యింది. నా ప్రభుత్వంలో మీకు మంచి జరిగితేనే నాకు మళ్ళీ ఓటు వెయ్యండి.. లేదంటే వద్దు అని యంగ్ డైనమిక్ లీడర్.. సీఎం జగన్ బహిరంగంగా తలెత్తుకొని మరీ చెప్తున్నారు. కానీ.. 14ఏళ్ళు సీఎం గా చేసిన చంద్రబాబు అంత గట్టి నమ్మకంతో ఎందుకు చెప్పలేకపోతున్నారు. ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే..దీనిపై కూడా మీ ఏడుపులేనా. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన వర్ల రామయ్య 1902 కి కాల్ చేసి.. ప్రజలు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం వినియోగించే గ్రీవెన్స్ సెల్ పై రాజకీయం చేశారు. జగనన్నకి చెబుదాం ఉద్యోగికి కాల్ చేసి నీ దుంప తెగ అంటూ మర్యాదపూర్వకంగా మాట్లాడారు. నీ పేరు చెప్పు నీ ఫోన్ నెంబర్ చెప్పు అంటూ ఉద్యోగిని ఇబ్బంది పెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలకై కాల్ సెంటర్ ని ప్రారంభిస్తే.. వైసీపీ వాళ్ళు ఇలానే కాల్ చేసి ఇబ్బంది పెట్టారా..? మరి ఇప్పుడు టీడీపీ చేస్తున్న రాజకీయాన్ని ఏమనాలి.