రాజకీయాలంటేనే నటన. అయితే నటనే రాజకీయంగా మలుచుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే… అది ఒక్క చంద్రబాబే అని చెప్పాలి. ఆయన ఎంత గొప్ప నట చక్రవర్తి అంటే… అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఆయన నటనకు పచ్చ మీడియా వత్తాసు పలకడం… ఇంకా పెద్ద నటన అనే చెప్పాలి. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తాదంట … పెద్దలు కొన్ని సామెతలు ఊరికే పెట్టలేదు. బహుశా ఇలాంటి వారికోసమే అనుకుంటా. మనసులో మకిలి… బుర్రలో బురద ఇది చంద్రబాబు అసలైన రాజకీయ జీవితం. చంద్రబాబు చేస్తే గొప్పలు, జగన్ చేస్తే తప్పులు. బాబు చేస్తే పాలన, జగన్ చేస్తే హేళన. ఇదే పచ్చ మీడియా ప్రతిరోజూ.. అల్లే కథలు, కధనాలు. ఏపీలో నాలుగేళ్లుగా అవినీతిలేని సుపరిపాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వంపై పడి ఏడుస్తుంది.. బాబు ఆయన పచ్చ మీడియా. ప్రతిరోజూ జగన్ ప్రభుత్వ౦పై ఏదో ఒక ఆరోపణలు చేయనిదే.. పచ్చ మీడియాకి రోజు గడవదు. ఎక్కడా లేని వార్తలను సృష్టించి మరీ.. వాటికి ఇంకాస్త మసాలాలు యాడ్ చేసి కధనాలు వండి వారుస్తోంది. జగన్ ప్రభుత్వం అప్పుల కోసం తిప్పలు పడుతుంది అంటూ, ఇలాంటి ప్రభుత్వమే మళ్ళీ వస్తే ప్రమాదమే అంటూ పచ్చ మీడియాలో కధనం వచ్చింది. ఈ కధనంతో రియాక్ట్ అయిన వైసీపీ చంద్రబాబు అధికారం ముసుగులో చేసిన అప్పులు, ఆయన చేసిన అవినీతి రాజకీయాలు ఇప్పుడు ఆధారాలతో సహా బయట పెడుతోంది.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలసొమ్ముతో ఏటా దావోస్ వెళ్లి షికార్లు చేసి.. పావలా పెట్టుబడులు అయినా తెచ్చారా..? షికార్ల కోసం విదేశీ పర్యటనలు వెళ్ళి .. అదంతా రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టం అంటూ బగ్రౌండ్ లో ఎల్లో మీడియా చిడతలు వాయించడం నిజం కాదంటారా..? బాబు పాలనలో రాష్ట్ర రైతాంగం మొత్తం కుదేలై, అప్పులపాలై చివరకు ఆత్మహత్యలు చేసుకున్నాఎల్లో మీడియా ఎందుకు సైలెంట్ గా ఉంది..? అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేసినా దార్శనికుడు అంటూ కలరింగ్ పచ్చ మీడియా కవరింగ్ ఇవ్వలేదంటారా..? అప్పులు చేసి తెచ్చిన డబ్బుతో ప్రజలకు పైసా పెట్టారా..? అభివృద్ది అంటూ.. తెచ్చిన అప్పులను ఎం చేశారు..? ఎవరు మింగేశారు..? 2019లో ఏర్పడిన సంక్షోభంలో కూడా సిఎం జగన్ ఏనాడైనా ప్రజలకు ఇచ్చే ఒక్క సంక్షేమ పధకాన్ని అపారా..? చంద్రబాబు హయాంలో తెచ్చిన అప్పంతా జన్మభూమి కమిటీలకే దోచి పెట్టింది.. ఎల్లో మీడియాకి కనపడలేదా..? ఆర్టీసీచార్జీలు, కరెంట్ చార్జీల పెంపు నాడు పచ్చ మీడియాకి తెలియలేదా..? నాడు చంద్రబాబు వైద్య రంగానికి కేవలం 8 వేల కోట్లు కర్చు చేస్తే.. నేడు సిఎం జగన్ 18 వేల కోట్లు కర్చు చేస్తున్నారు.. ఇది పచ్చ మీడియాకి కనబడలేదా..? నాడు చంద్రబాబు 34వేల ఉద్యోగాలు కల్పిస్తే.. జగన్ ఏకంగా 2 లక్షల 66 వేల ఉద్యోగాలు కల్పించింది ఎల్లో మీడియా ఎందుకు చెప్పట్లేదు..?
సరికదా ఏనాడూ ప్రజాసంక్షేమం గురించి ఆలోచిందింది లేదు. పైగా ఆర్టీసీచార్జీలు, కరెంట్ చార్జీల పెంపుతో వారి భుజాల మీద స్వారీ కూడా తప్పలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన సంక్షేమ సారధి నిత్యం ప్రజలగురించి ఆలోచిస్తూ పేదలకు నిత్యం తోడ్పాటును అందిస్తూ రాష్ట్రంలోని ప్రతివర్గమూ తనవర్గమే అని చెప్పుకునేలా పరిపాలిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని , ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణను చూసి కళ్ళు కుట్టిన ఎల్లోమీడియా ఇప్పుడు దాటిపోయినా వారు అందర్నీ ఆర్థికవేత్తలు అనే ట్యాగ్ లైన్ తగిలించి సీఎం వైయస్ జగన్ మీద దుమ్ము పోయించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రపంచ స్థాయి రాయబారులు, మేధావులు, పాలనా అనుభవం ఉన్నవారు సైతం కోవిడ్ సమయంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన సేవలు, అందిస్తున్న సపోర్ట్ చూసి అబ్బురపడ్డారు. కోవిడ్ సమయంలో పూటకు అల్లాడిన వర్గాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకున్న తీరు చూసి , ఆ సమయంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందించిన సేవలు చూసి దేశం యావత్తు ఔరా అని ఆశ్చర్యపడింది.
జగన్ చేసిన పాలనా సంస్కరణలు ఎన్నో రాష్ట్రాలకు మార్గదర్శకమయ్యాయి . రైతు భరోసా కేంద్రాలు చూసి ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు వచ్చి అక్కడి సేవలు చూసి మేమూ ఇలా చేస్తాం….ఏపీ మాదిరిగానే మా రాష్ట్రంలోనూ ఆర్బీకెలు ఏర్పాటు చేస్తాం అని వెళ్లిన రాష్ట్రాలు ఎన్నో.. గ్రామ, సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ బెంగాల్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలకు సైతం ఓ రిఫరెన్స్ అయింది. ఇవేమీ మన ఎల్లో మీడియాకు కానరావు. బాబు దిగిపోయే సరికి ఏపీ అప్పు 2,71,797 కోట్లు. మార్చి 31, 2023 నాటికి రాష్ట్ర అప్పులు 4,36,522 కోట్లు. అంటే ఈ 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు 1,64,725 కోట్లు. ఇది పచ్చ మీడియా కంటికి కానరాదు.
ఏపీలో జగన్ పాలనపై దేశవిదేశీయులే పొగుడుతున్నారు. అమెరికన్ ఆర్థిక వేత్త.. ఎస్తేర్ డాఫ్లో , విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నాబార్డ్ చైర్మన్ షాజీ కెవి. వీరంతా జగన్ పాలనను అభినందిస్తే.. పచ్చ మీడియా వీటిని ఎందుకు రాయలేదు. మనబడి, నాడు – నేడు, ఇంకా వైద్యకళాశాలల నిర్మాణం, పేదల సంక్షేమం, విద్య, వైద్యం , వ్యవసాయం, గృహనిర్మాణ రంగం, మహిళా సాధికారత.. ఇవేమీ అభివృద్ధి కాదా, సంక్షేమం కాదా.. మీ ఎల్లో మీడియావాళ్లకి ఇవేమీ పట్టవా..? ఎవరు ఎం చేశారు..? ఎవరు ఎంత ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. ఎన్నికల సమయంలో ఎవరిని ఎన్నుకోవాలో కూడా బాగా తెలుసు. ఎల్లో మీడియా ఎన్ని జాకీలు వేసి లేపినా అది బూడిదలో పోసిన పన్నీరు అవడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు.