1.నేడు సీఎం జగన్ నెల్లూరు జిల్లా కావలి పర్యటన..
చుక్కల భూములపై రైతన్నలకు సంపూర్ణ హక్కులు కల్పి౦చిన సిఎం జగన్.
2. చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ కళ్యాణ్ అజెండా..
పవన్ చెబుతున్నట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదు.. ఉన్నదల్లా సానుకూల ఓటే అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి.
3.చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయాగంలో పాల్గొన్న జగన్
విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో యాగం
4.సీఎం పదవి కావాలని అడగాలంటే ఆ స్థాయి ఉండాలి కదా అని వ్యాఖ్య..
టీడీపీతో పొత్తు ఖాయమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంకేతాలు.. ఫ్యాన్స్ ని అవమానపరిచే విధంగా పవన్ వ్యాఖ్యలు.
5.ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్. ఆగవయ్యా.. నువ్వాగు. ముందు నేను చెప్పేది వినవయ్యా’ అంటూ రైతులపై మండిపడ్డ చంద్రబాబు.
తణుకు నియోజకవర్గంలో రైతు పోరుబాట పేరుతో బాబు పాదయాత్ర.
6.చంద్రబాబు చేపట్టింది రైతు పోరుబాట కాదు..
అది రైతు పాడు యాత్రగా మిగిలిపోతుందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శ.
7.చంద్రబాబు కాన్వాయ్‌లో దర్శనమిచ్చిన వైసీపీ వాహనాలు..
15 కిలోమీటర్లు ఫాలో అయినా గుర్తించలేకపోయిన పోలీసులు!
8.కర్ణాటక ఎన్నికల్లో రికార్డు సృష్టించిన గ్రామీణ ఓటర్లు!
బెంగళూరు అర్బన్ పరిధిలోని సీవీ రామన్ నగర్‌లో 47.4 శాతం ఓటింగ్ నమోదు.
9. పవన్ మాటలు ప్రజల్లో భరోసా నింపాయి..
జగన్‌ని ఓడించాలంటే ఏకం కావాల్సిందే అంటూ నిమ్మల రామానాయుడు వ్యాఖ్య.
10.అంతర్జాతీయ నెంబర్ల నుంచి వాట్సప్ స్పామ్ కాల్స్ పై రంగంలోకి కేంద్రం
ఈ విషయంపై వాట్సప్ కు నోటీసులు జారీచేస్తామన్న కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ