రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించని పరిణామం. ఎన్నికలలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు అన్నది.. వారి పాలన మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఈ నేపధ్యంలోనే కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి నిద్ర వపట్టకుండా చేశాయి. అక్కడ కాంగ్రెస్ భారీ విజయాన్ని చేజిక్కించుకుంది. దేశంలో మోదీ మ్యానియా కొనసాగుతున్న తరుణంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ అనే చెప్పాలి. అయితే.. అసలు రాజకీయం ఇక్కడితో అయిపోలేదు. అసలైన రాజకీయం సెంట్రల్ లో ఉంది. హ్యాట్రిక్ కొట్టాలని మోదీ పక్కా వ్యూహ౦తో ఉన్నారు. ఈసారి కూడా సెంట్రల్ లో విజయం సాధించి.. తన హవా కొనసాగించాలని మోదీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మోదీ కి కాస్త మెజారిటీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఆ ఎన్నికలే దేశ ప్రధాని ఎవరో అన్నది తేల్చనున్నాయి. అయితే.. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిచడం, తెలంగాణలో బీఆర్ఎస్ కూడా మోదీకి వ్యతిరేకంగా పావులు కదపడం, అంతేకాకుండా మోదీని గద్దె దించేందుకు దేశంలో వ్యతిరేక శక్తులు ఏకం అవుతున్నాయి. కానీ మోదీకి సిఎం జగన్ సపోర్ట్ చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని తాజాగా ఓ సర్వే కూడా వెల్లడించింది. గతంలో కూడా సిఎం జగన్ మోడీకే తమ మద్దతు ప్రకటించారు. ఈసారి కూడా సిఎం జగన్ అవసరం మోదీకి ఎంతైనా ఉంది. అన్ని లోక్ సభ సీట్లు ఉన్న సిఎం జగన్ ను మోడీని ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోరనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే.. చంద్రబాబుని ప్రధాని మోదీ ఎట్టి పరిస్థితులలో నమ్మరని, అందుకే టిడిపి తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ అధిష్టానం వెనకాడుతుందని విశ్లేషకులు అంటున్నారు.
అయితే ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఓటమి పాలయినప్పటికీ.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకే అధిక సీట్లు వస్తాయని కొన్ని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి.