పవన్ గాలి తుస్ ఇది ఒకరకమైన ఘోర అవమానం

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దేశ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి రాను రాను హవా తగ్గుతూ వస్తోంది. ఇక ఏపీ విషయానికొస్తే.. బీజేపీ చాలా మైనస్ లో ఉంది. అయితే.. ఏపీలో సిఎం జగన్ ను ఓడించడానికి ప్రతిపక్షాలు ఎన్నో రకాల స్టంట్ లు వేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులతో వస్తామని పవన్ కళ్యాణ్ ఓపెన్ గానే చెప్తున్నారు. అయితే.. కర్ణాటకలో గాలి జనార్ధన్ రెడ్డి విజయం సాధించి అందరి చేత మన్ననలు పొందారు. ఇక ఈ నేపధ్యంలోనే పవన్ పై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. నిన్న కాక మొన్న పార్టీ పెట్టి తొలి ప్రయత్నంలో సక్సస్ సాధించారు, అంతేకాదు ఏకంగా 47 నియోజకవర్గాలలో తమ అభ్యర్ధులను నిలబెట్టి ఔరా అనిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నారు.. దేనికీ ఉపయోగం లేదని, మైక్ పట్టుకొని ఊగిపోవడం, మెడలో ఎర్ర కండువా వేసుకొని ఎగరవేయడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పార్టీ పెట్టి 11 ఏళ్లు అయినప్పటికీ.. తనకంటూ ఒక క్యాడర్ లేదని, ప్రతి ఎన్నికల్లోనూ ఒక అజెండా అంటూ లేని విధంగా ఎన్నికల్లో పోటీ చేసి చివరికి ఓటమి పాలవడం పవన్ కళ్యాణ్ కి అలవాటేనని అంటున్నారు. అంతేకాదు ఎన్నికల తర్వాతే సీఎం సీటు గురించి మాట్లాడుకుందామని పవన్ చెప్పటం చాలా సిగ్గుచేటని అంటున్నారు. గాలి జనార్ధన్ రెడ్డిని చూసి అయినా పవన్ కళ్యాణ్ సిగ్గు తెచ్చుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. దమ్ముంటే సింగిల్ గా గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టి తనకు మాత్రమే న్యాయం చేసుకుంటున్నారని, తనను నమ్ముకున్న జనసైనికులను నమ్మించి మోసం చేస్తున్నారని స్వయంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే అంటున్నారు.