చంద్రబాబుకు భారీ షాక్ పవన్ పరువు తీసిన పాల్ అసలు నిజం ఒప్పుకున్న నాదెండ్ల

1.చంద్రబాబుకు భారీ షాక్…
కరకట్టపై ఆయన గెస్ట్ హౌస్ ను ఏపీ ప్రభుత్వం అటాచ్. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు.

2.నీ నాయకుడు చంద్రబాబేనని ఒప్పుకుని భజన చేసుకో..
లేదా చిరంజీవి, వంగవీటి రంగాలా రాజకీయాలు చేయి.. పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని హితవు.

3.టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం..
పొత్తుపై తమ అధిష్టానమే అంతిమ నిర్ణయం తీసుకుంటుందని జీవీఎల్ నరసింహారావు స్పష్టం.

4.టీడీపీలాగా ఊతకర్ర పట్టుకోం.. పొత్తులపై భయపడేది లేదు, వైసీపీ ఒంటరిగానే పోటీ..
వచ్చే ఎన్నికల్లో వైసీపీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం.

5.ఈసారి పొత్తులతోనే బరిలోకి .. టీడీపీ, బీజేపీలతో మాట్లాడాం..
కానీ సీట్ల గురించి ఇంకా చర్చలు జరగలేదని నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు.

6.చంద్రబాబు గెస్ట్‌హౌస్ అటాచ్.. అవన్నీ తప్పుడు కేసులే..
నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావన్న బొండా ఉమా.

7.వచ్చే ఎన్నికల్లోఏపీలోనూ కర్ణాటక సీన్ రిపీట్ అవుతుంది..
టీడీపీ విజయం తప్పదు అంటూ అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం.

8.కర్ణాటకలో రసవత్తరంగా మారిన రాజకీయం…
ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య సీక్రెట్ చర్చలు!

9.కృష్ణా నది కరకట్ట నివాసానికి జప్తు నోటీసులతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదు..
అక్కడేం జరిగిందని నోటీసులు ఇచ్చారన్న వర్ల రామయ్య

10.పది పార్టీలు మారావు పవన్… నీకసలు స్థిరత్వం ఉందా?..
పవన్ ప్యాకేజి స్టార్ అని ముందు నుంచి చెబుతున్నానని కేఏ పాల్ వ్యాఖ్యలు