కరకట్టపై చంద్రబాబు ఇల్లు సీజ్..!

నిప్పు లేనిదే పొగ రాదు గదా చంద్రబాబు.. తప్పు చేశావు కాబట్టే నీ అవినీతి గుట్టు ఒక్కొక్కటిగా బట్టబయలవుతుంది. ఉరుములు మెరుపులు లేకుండా పిడుగు ప‌డ్డ‌ట్టుగా లింగ‌మ‌నేని గెస్ట్‌హౌస్‌ను ప్ర‌భుత్వం అటాచ్ చేయ‌డం… అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య సాగుతున్న వార్‌కు ప‌రాకాష్ట‌గా చెప్పొచ్చు. అమరావతి కరకట్టపై చంద్రబాబు ఉంటున్న లింగమనేని ఇంటి జప్తుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చంద్రబాబుతో పాటుగా నారాయణ సంబంధీకుల ఆస్తుల జప్తుకు అనుమతి లభించింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు..నారాయణ..లింగమనేని రమేష్ సహా 14 మందిని నిందితులుగా పేర్కొంది. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించిన సీఐడీ ప్రభుత్వానికి కొన్ని కీలక సిఫార్సులు చేసింది.
అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ తయారీ, ఆమోదంలో చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్‌, మరికొందరు కూడబలుక్కొని ఈ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. ఇక ఇవే అంశాలను పేర్కొంటూ.. ఎమ్మెల్యే ఆర్కే గతంలోనే ఫిర్యాదు చేశారు.

క్విడ్‌ప్రోకో కింద రాజధాని మాస్టర్‌ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు లే అవుట్‌, జోనల్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్స్‌ ద్వారా లింగమనేనికి భారీ లబ్ధి చేకూరినందున, లింగమనేని ఇంటిని అమ్మకుండా నిరోధించేందుకు క్రిమినల్‌ లా అమెండ్‌మెంట్‌ ఆర్డినెన్స్‌1944 కింద జప్తు చేసేందుకు, తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అనుమతి కోరింది. ఈ మేర కు హోంశాఖ ముఖ్యకార్యదర్శి సీఐడీకి అనుమతి ఇస్తూ జీవో జారీచేశారు. నారాయణ సంబంధీకుల ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఈ నేపధ్యంలోనే.. కరకట్టపై చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటిని సీజ్ చేస్తారని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. మరి ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.