అమరావతిలో జరిగిన అక్రమాలపై నిజాలు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి. నాడు టీడీపీ హయాంలో అధికార ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. చివరికి వారి పాపం పండింది. సీఐడీ నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ వ్యవహారంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ ఆయన బంధువుల ఆస్తులు అటాచ్ చేశారు.
ఏ-1 చంద్రబాబు , ఏ-2 నారాయణతోపాటు ఇతర నిందితులు తమ అధికార పదవులను దుర్వినియోగం చేశారని తేలింది. ఇతర నిందితులతో వారి నేరపూరిత కుట్రను అనుసరించి, వారు వాస్తవాలను దాచిపెట్టడం, వాస్తవాలను తప్పుగా సూచించడం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క చట్టాలు మరియు ఆదేశాలను విస్మరించడం ద్వారా మరియు అనేక మంది వ్యక్తులు లేవనెత్తిన నిజాయితీ గల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్ణయం తీసుకునే ప్రక్రియను నడిపించారు. అధికారులు, ఎట్టకేలకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతి రాజధాని నగరంలోని 06.84 చదరపు కిలోమీటర్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి మాస్టర్ డెవలపర్లను ఎంపిక చేశారు.అప్పటి మంత్రి నారాయణ , ఎపిసిఆర్డిఎ వైస్ ఛైర్మన్గా ఉండి అనేక అక్రమాలకు తెరతీశారు. నారాయణ వద్ద జీతాలకు పని చేసే ఉద్యోగులకు కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చేయన్నదే ఇక్కడ మరో ప్రశ్నగా మారింది. ఉద్దండరాయునిపాలెం పొట్లూరి ప్రమీలకి రెండువేల గజాలు, రాయపూడిలో రాపూరు సాంబశివ రావు 5 వేల గజాలు, నారాయణ ఉద్యోగి ఆవుల ముని శంకర్ పేరుతో 11 వేల గజాలు, ఇంతేకాకుండా వీరి ఖాతాలోకి 20 నుంచి 70 లక్షల రూపాయలు ఒక్క రోజులోనే క్రెడిట్ అయ్యాయి. ఈ సొమ్మంతా ఎందుకు వారి ఖాతాలోకి జమ అయ్యాయి..? ఉద్యోగాలు చేస్తున్న వారి ఖతాలోకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యాయి అంటే ఎంత అవినీతి జరిగిందో చాలా స్పష్టంగా అర్ధంఅవుతుంది. మరి ఎల్లో మీడియా ఈ నిజాలను ఎందుకు చెప్పడం లేదు..? అమరావతిలో పేద ప్రజల
భూములను అన్యాయంగా లాక్కొని.. అధికారం చేతిలో ఉంది కదా అని.. అదే భూములను ఎక్కువ లాభాలు ఆర్జించిన నిజాన్ని ఈ ఎల్లో మీడియాకి తెలియదా అంటూ రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు.