1.రాష్ట్రంలో 65 కోట్లతో లెదర్ పరిశ్రమాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం…
లిడ్ క్యాప్ ప్రగతికి కార్యాచరణ పథకాన్నిరూపొందిస్తున్నామనిమంత్రి మేరుగు నాగార్జున వెల్లడ
2. ఏపిలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు…
ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానంలోనే సాగనుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడి.
3.రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన రైతులకు ఎదురుదెబ్బ…
ఆర్-5 జోన్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ.
4.లోకేశ్ వెయ్యి రోజులు పాదయాత్ర చేసినా ప్రయోజనం ఉండదు …
ప్రొద్దుటూరుకు పాదయాత్ర వస్తే అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్య.
5.చంద్రబాబును కలవడానికి వెళ్లినప్పుడు నాదెండ్లను ఎందుకు తీసుకెళ్లలేదు?
పవన్ ముమ్మాటికీ ప్యాకేజి స్టార్ అంటూ నల్లపురెడ్డి విమర్శలు
6.వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు…
ఈ నెల 16న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ.
7.వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి ఎదురుదెబ్బ..
బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
8.చంద్రబాబు బరితెగింపు తనానికి ఉదాహరణ అదే..!
అక్రమాలకు చిరునామాగా చంద్రబాబు ఉన్న అక్రమ నివాసం కనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ.
9. కర్ణాటక తీర్పుతోనైనా ఏపీ పార్టీల్లో మార్పు రావాలి..
కన్నడనాట 212 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు మద్దతిచ్చారని సీపీఐ నారాయణ వెల్లడి.
10. ఈనెల 18న శృంగవరపుకోటలో చంద్రబాబు పర్యటన..
సభ ఏర్పాట్లు, పర్యటనకు సంబంధించిన అంశాలను పరిశీలించిన కేబీఏ రాంప్రసాద్.