పొలిటికల్ గ్రౌండ్‎లోకి వైయస్ ఫ్యామిలీ వారసులు ఇక జగన్ కి తిరుగులేదు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకుల స్ట్రాటజీలలో మరింత పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరో వైపు సిఎం జగన్ మరింత దూకుడుగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల రణరంగంలో గెలుపైనా, ఓటమి అయినా.. ఒంటరిగానే భరిలోకి దిగుతానని సిఎం జగన్ డేర్ అండ్ డాష్ గా ప్రతిపక్షాలకు సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో విజయం సాధించి. రికార్డ్ బద్దలు కొట్టాలని సిఎం జగన్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే.. వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. పులివెందులలో టిడిపి కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కడప జిల్లాలో పట్టు సాధించాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆయన చంద్రబాబు ఎత్తులను తిప్పికొట్టాలని సిఎం జగన్ తన ఫ్యామిలీకి సంబందించిన వారసులను రంగంలోకి దించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ యంగ్ లీడర్ మరెవరో కాదు.. భాస్కరరెడ్డి అన్న ప్రకాశ్ రెడ్డి కుమారుడు వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి తనయుడు డాక్టర్ అభిషేక్ రెడ్డి. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో కలిసి వైఎస్ అభిషేక్‌రెడ్డి కనిపించడం కడప రాజకీయాల్లో సరికొత్త చర్చకు కారణమైంది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో తాజాగా వీరిద్దరూ పర్యటించారు. అవినాశ్ రెడ్డితో కలిసి పర్యటనలో పాల్గొనడం ఇదే తొలిసారి.ఈయన ఎంట్రీ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు ఆయనకు అప్పగించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో అభిషేక్ రెడ్డి వైఎస్ జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం కూడా చేశారు. విశాఖపట్టణంలో వైద్య వృత్తిలో స్థిరపడిన అభిషేక్ రెడ్డి.. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంపై.. పలు రకాల చర్చలకు తావిస్తున్నాయి. కడప జిల్లా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట.. అలాంటి కంచుకోటలో తమ హవా కొనసాగించాలంటే.. ఇలా ఎప్పటికప్పుడు వారసులు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి.. తమ పట్టు నిలుపుకోవాల్సిందే అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ అభిషేక్ రెడ్డి ఎన్నికల భరిలోకి దిగుతారో లేక.. కేవలం ఎన్నికల ప్రచారంతో సరిపెడతారో చూడాలి.