ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ ఫ్రస్టేషన్లో చంద్రబాబు

1.పేదల ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లండి..
గృహనిర్మాణ శాఖ సమీక్షలో అధికారులకు సీఎం జగన్ ఆదేశం.

2.రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు కొని అందరికీ ఇళ్లిచ్చిన ఘనత సిఎం జగన్ ది..
పేదల ఇళ్ల కోసం గత ప్రభుత్వం కనీస ఆలోచన చేయలేదు అంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్య.

3.చంద్రబాబుది దింపుడుకల్లం ఆశ. లోకేష్ ఎదగలేదనీ, పార్టీ బతకదని చంద్రబాబుకు పూర్తిగా అర్థమయ్యింది…
అందుకే ఫ్రస్టేషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణ సెటైర్లు.

4.టెన్త్ టాపర్లకు బొనాంజా ప్రకటించిన సిఎం జగన్…
నియోజకవర్గంలో 1,2,3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా 15వేలు, 10వేలు, 5 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు.

5.వివేకా హత్య కేసులో అంశాలను వక్రీకరించడం సరికాదు…
తాను సీబీఐకి గుండెపోటు అని చెప్పానని అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం ప్రిన్సిపల్ అడ్వెజర్ అజయ్ కల్లాం ఫైర్.

6.తిట్టినా.. గెటవుట్ అన్నా.. జగన్ కోసమే పని చేస్తా..
పార్టీ మారుతున్నారు అన్న ప్రచారంపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ.

7.వైసీపీ ఇచ్చిన హామీలను కనీసం గుడివాడలోనైనా పూర్తిగా నెరవేర్చారా?..
కొడాలి నానికి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నలు.

8.రాష్ట్రం కోసమే యాగమని నమ్మించే గొప్పవాడివయ్యా..
కోర్టు కేసుల్లో సానుకూలత రావాలని కోరుకుంటూ యాగ సంకల్పం చేశారని జగన్ పై ధూళిపాళ్ల నరేంద్ర సెటైర్లు.

9.ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై సుప్రీంలో సునీతా పిటిషన్.
జూలై 1న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ.

10.టిడ్కో ఇళ్లు మీ ఆస్తి… ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు…
పెందుర్తిలో టిడ్కో ఇళ్ల లబ్దిదారులతో సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు.